Corona in India : 36,571 కొత్త కేసులు, 540 కి పెరిగిన మరణాలు, రాష్ట్రాల్లో కేసులు ఇలా !!

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశం 36,571 కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 3.4% పెరిగినట్లుగా తెలుస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా మరణాలు నిన్న ఒక్కరోజే 540కి పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.23 కోట్లుగా ఉండగా, మొత్తం మరణాలు 4.33 లక్షలుగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

150 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు

150 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు

తాజాగా 39,157 మంది కరోనా బాధితులు మహమ్మారి బారినుండి కోలుకున్నారని ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దీంతో మొత్తంగా 3,15,25,080 మంది కరోనా బారినుండి కోలుకున్నట్లుగా తెలుస్తుంది. జాతీయ రికవరీ 97.54 శాతానికి పెరిగిందని, రోజువారీ పాజిటివ్ రేటు 1.94 శాతంగా ఉందని డేటా వెల్లడిస్తోంది. మరోవైపు యాక్టివ్ కేసులు 150 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 3,63,605 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1.12%గా ఉంది.

 కేరళలో కరోనా పంజా .. గత 24 గంటల్లో 21,116 కొత్త కేసులు

కేరళలో కరోనా పంజా .. గత 24 గంటల్లో 21,116 కొత్త కేసులు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 21,116 కొత్త కేసులు నమోదైనట్లు గా తెలుస్తుంది. దేశంలో కొత్త ఇన్ఫెక్షన్లలో 50 శాతానికి పైగా దక్షిణాది రాష్ట్రమైన కేరళలో నమోదు అవుతున్నట్లుగా సమాచారం. కేరళలో పరీక్ష సానుకూలత రేటు దాదాపు 13.97 శాతంగా ఉంది. దేశంలో అత్యధికంగా దెబ్బతిన్న మహారాష్ట్ర, గత 24 గంటల్లో 5,225 కొత్త కరోనా కేసులను, అండ్ 154 మరణాలను నివేదించింది. మహారాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం, పుణేతో సహా కేవలం ఏడు జిల్లాలు మాత్రమే మహారాష్ట్రలో ఎక్కువ అంటువ్యాధులకు కారణమవుతున్నాయి.

మహారాష్ట్ర తో వివిధ రాష్ట్రాల్లో తాజా కేసులు ఇవే

మహారాష్ట్ర తో వివిధ రాష్ట్రాల్లో తాజా కేసులు ఇవే

మహారాష్ట్ర తర్వాత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న రాష్ట్రంగా తమిళనాడు రాష్ట్రం ఉంది తమిళనాడులో గత 24 గంటల్లో 1702 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ 1,501 కేసులు నమోదు చేయగా ఐదవ స్థానంలో కర్ణాటక 1,432 కరోనా కేసులు నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 25 కొత్త కేసులు మరియు రెండు వైరస్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో పశ్చిమ బెంగాల్లో 731 కరోనా కేసులు, ఒడిశాలో 1041 కరోనా కేసులు, అస్సాంలో 713 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    KL Rahul 2.0 కన్నడ డైనమైట్‌.. Lord’s బోర్డులో సువర్ణక్షరాలతో, వాళ్ళకే సాధ్యంకాలేదు | Oneindia Telugu
    కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీగా కేసులు .. వ్యాక్సినేషన్ ఇలా

    కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీగా కేసులు .. వ్యాక్సినేషన్ ఇలా

    మణిపూర్ లో 526 కరోనా కేసులు, మేఘాలయాలో 329 కేసులు, మిజోరాంలో 487 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధిక జనాభా ఉండే ఉత్తరప్రదేశ్లో 25 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి . ఇక రాజస్థాన్లో 12 కేసులు, గుజరాత్లో 19 కేసులు, మధ్యప్రదేశ్లో 18 కేసులు, హర్యానాలో 25 కేసులు, బీహార్లో 15 కేసులు, పంజాబ్లో 63 కేసులు, జార్ఖండ్లో 23 కేసులు, గోవాలో 83 కేసులు, చండీగడ్ లో 6 కేసులు, నాగాలాండ్ లో 59 కేసులు సిక్కింలో 94 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 57.22 కోట్ల టీకా డోసులు పంపిణీ చేయబడ్డాయి. ఇప్పటివరకు 50.26 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు గా ఐసీఎంఆర్ వెల్లడిస్తుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+