
భారత్ లో కరోనా తాజా అప్డేట్: 15వేలకు పైగా కొత్త కేసులు, 226 మరణాలు; క్షీణిస్తున్న యాక్టివ్ కేసులు!!
భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 15,823 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, 226 మంది కరోనా మహమ్మారి కారణంగా బలైపోయారు. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు, అంతకుముందు నమోదైన కేసుల కంటే 10.5 శాతం ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,01,743 కు చేరుకుంది.
భారత్
కు
బిగ్
రిలీఫ్
..
15
వేలకు
దిగువన
కరోనా
కొత్త
కేసులు,
181మరణాలు
గత 24 గంటల్లో మరణించిన 226 మందితో కలిపి ప్రస్తుతం దేశంలో మొత్తం మరణాల సంఖ్య 4,51,189 గా ఉంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 2,07653 కు తగ్గాయి. గత 24 గంటల్లో 22,844 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినుండి కోరుకున్న వారి మొత్తం సంఖ్య 3,33,42,901 గా ఉంది. ఇదిలా ఉంటే కరోనా యాక్టివ్ కేసులు 0.61 శాతానికి చేరుకున్నాయి. 214 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు చేరుకున్న పరిస్థితి ప్రస్తుతం దేశంలో కనిపిస్తుంది .

కరోనా రికవరీ రేటు 98.06 శాతానికి చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.19 శాతంగా నమోదు కాగా వీక్లీ పాజిటివిటీ రేటు 1.46 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతుంది. గత 24 గంటల్లో 50,63,845 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తంగా 96,43,79,212 వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి నిర్ధారణ కోసం 13,25,399 నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 58,63,63,442 నమూనాలను పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది.
ఇదిలా ఉంటే రోజువారీ కేసులలో అత్యధిక కేసులు నమోదు చేస్తున్న కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,823 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, 106 మంది మరణించారు. కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,069 కొత్త కేసులు నమోదు కాగా 43 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 30,525 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత అత్యంత ప్రభావితమైన మిజోరాం రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో మిజోరాంలో 1430 కరోనా కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించారు. 13,264 యాక్టివ్ కేసులున్నాయి.
Recommended Video
ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు రాష్ట్రంలో 1289 కొత్త కేసులు నమోదు కాగా 18 మంది మరణించారు .15,842 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 768 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి పదిమంది కరోనా కారణంగా మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం 7,672 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 503 కొత్త కేసులు నమోదు కాగా 12 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6,932 గా ఉంది.