Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lockdown: కరోనా కాలంలో పోయేకాలం, గ్యాంగ్ లీడర్ బర్త్ డే, తల్వార్ తో కేక్ కట్, పెళ్లి చేసిన పోలీసులు

చెన్నై/ విల్లుపురం: కరోనా వైరస్ (COVID 19) కట్టడి చెయ్యడానికి దేశంలో రెండో విడత లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడగించారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని, సభలు, సమావేశాలు, పండగలు, శుభకార్యాలతో పాటు ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదని కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సమయంలో ఓ రౌడీ బర్త్ డే వేడుకలను నడి రోడ్డులో తల్వార్ ( కత్తి)తో కేక్ కట్ చేయించి నానా హంగామా చేసిన యువకులు, వారి గ్యాంగ్ లీడర్ నేడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. కరోనా లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి కత్తుల చేత పట్టుకుని రోడ్ల మీదకు వచ్చి కేక్ కట్ చేసి స్థానిక ప్రజలను ఆందోళనకు గురి చేసిన యువకులకు లాఠీలతో పెళ్లి చేసి తగినశాస్తి చేశామని పోలీసులు అంటున్నారు.

విల్లుపురం స్ట్రీట్ రౌడీ

విల్లుపురం స్ట్రీట్ రౌడీ

తమిళనాడులోని విల్లుపురం జిల్లా వీరపాండి ప్రాంతంలో మణికందన్ అనే రౌడీ నివాసం ఉంటున్నాడు. ఇతని స్నేహితులు తమిళ అందం, సుందరమూర్తి, పాండియన్, గణపతి, సెల్వ, మణి తదితరులు ఉన్నారు. వీరపాండి ప్రాంతంలో మణికందన్ అతని స్నేహితులు రౌడీయిజం చేస్తూ స్థానికులను నిత్యం ఏదో ఒక విదంగా భయపెడుతున్నారు.

గ్యాంగ్ లీడర్ బర్త్ డే

గ్యాంగ్ లీడర్ బర్త్ డే

కరోనా వైరస్ కట్టడి చెయ్యడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలులో ఉంది. తమిళనాడులో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న సమయంలో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం కరోనా కట్టడికి అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఇదే సమయంలో రౌడీ రాయుడు, ఆ ప్రాంతం గ్యాంగ్ లీడర్ మణికందన్ బర్త్ డే రోజు వచ్చింది.

నడి రోడ్డులో కత్తులతో హల్ చల్

నడి రోడ్డులో కత్తులతో హల్ చల్

గ్యాంగ్ లీడర్ మణికందన్ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా చెయ్యాలని అతని స్నేహితులు పాండియన్, సుందరమూర్తి. తమిళ అందం, గణపతి, సెల్వ తదితరులు నిర్ణయించారు . భారీ కేక్ తయారు చేయించి రాత్రి బర్త్ డే పార్టీకి అన్నీ సిద్దం చేశారు. వీరపాండి ప్రాంతంలోని రాజపాలం వీధిలో పెద్ద టేబుల్ మీద కేక్ పెట్టి కత్తులతో బర్త్ డే బాయ్ మణికందన్ చేత కేక్ కట్ చేయించారు. రాత్రి వీధిలో అరుపులు, కేకలు వేసి స్ట్రీట్ రౌడీ మణికందన్ బర్త్ డే పార్టీ చేసుకున్నారు.

వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి !

వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి !

స్ట్రీట్ రౌడీ మణికందన్ పెద్ద తల్వార్ తో కేక్ కట్ చేస్తున్న సమయంలో అతని స్నేహితులు వీడియో తీసి మేమంటే ఏమనుకున్నారు ? మాకు లాక్ డౌన్ లేదు, తొక్కా లేదు అంటూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్ట్రీట్ రౌడీ మణికందన్ బర్త్ డే పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ విషయం కాస్త పోలీసులకు తెలిసిపోయింది.

Recommended Video

    India Lockdown 2.0 : KCR To Take A Key Decision On April 20th Over Coronavirus Lockdown
    విందు భోజనం పెట్టిన పోలీసులు

    విందు భోజనం పెట్టిన పోలీసులు

    విషయం తెలుసుకున్న విల్లుపురం పోలీసులు వీరపాండి ప్రాంతానికి వెళ్లి లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి నడి రోడ్డులో కత్తులతో కేక్ కట్ చేసి బర్త్ డే చేసుకున్న స్ట్రీట్ రౌడీ మణికందన్, హంగామా చేసిన అతని స్నేహితులు ఐదు మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన శైలిలో వారికి లాఠీలతో విందు భోజనం పెట్టారు. అందర్నీ కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపించామని, ఎవరైనా ఇలాగే బర్త్ డేలు, తొక్కా తొటారం అంటూ చిందులు వేస్తే నిలువునా చీల్చేస్తామని పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+