వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ కు కరోనా కొత్త వేరియంట్ భయం: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో ఏవై 4.2 కేసులు !!

|
Google Oneindia TeluguNews

భారతదేశాన్ని కరోనా మహమ్మారి వదిలేలా కనిపించటం లేదు. రోజుకో రకంగా రూపాంతరం చెందుతూ దేశంపై దాడి చేస్తుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలో కరోనా మహమ్మరి యొక్క కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తుంది . ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి క్షీణిస్తున్నదని భావిస్తున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు ఒక్కసారిగా భారత్ ను ఉలిక్కిపడేలా చేశాయి . మొన్నటి వరకు డెల్టా వేరియంట్ డెల్టా ప్లస్ ఉత్పరివర్తన పట్ల భయం వ్యక్తం కాగా ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వణికిస్తుంది. డెల్టా వేరియంట్ యొక్క ఉత్పరివర్తనాల తర్వాత ఇప్పుడు మళ్ళీ భారత్ కు కరోనా వైరస్ భయం పట్టుకుంది.

వ్యాక్సిన్ తీసుకోకుంటే నో రేషన్, నో పింఛన్: ఆ వార్తలు నమ్మొద్దు; తెలంగాణా డీహెచ్ శ్రీనివాస రావు యూటర్న్వ్యాక్సిన్ తీసుకోకుంటే నో రేషన్, నో పింఛన్: ఆ వార్తలు నమ్మొద్దు; తెలంగాణా డీహెచ్ శ్రీనివాస రావు యూటర్న్

మధ్యప్రదేశ్ ఇండోర్‌లో కరోనా కొత్త వేరియంట్ కేసులు

మధ్యప్రదేశ్ ఇండోర్‌లో కరోనా కొత్త వేరియంట్ కేసులు


నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ (NCDC) నుండి విడుదల చేసిన జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలో భారత్ లో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఈ కొత్త వేరియంట్ యొక్క ఏడు కేసులు కనుగొనబడ్డాయి. మహమ్మారి ప్రారంభం నుండి దేశంలో ఈ వేరియంట్ కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో 1 శాతం శాంపిల్స్‌లో కొత్త డెల్టా ఏవై 4.2 వేరియంట్ కనుగొనబడింది. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదు కావటం ఇప్పుడు మహారాష్ట్ర వాసులను వణికిస్తుంది.

డెల్టా కంటే డేంజర్ ? జరుగుతున్న పరిశోధనలు

డెల్టా కంటే డేంజర్ ? జరుగుతున్న పరిశోధనలు

కొత్త రూపాంతరం చెందిన వేరియంట్ రకం డెల్టా జాతి కంటే ఎక్కువ అంటువ్యాధి కలిగి ఉంటుందని, మరింత ప్రసారం చేయగలదని శాస్త్రవేత్తలు సూచించారు. ఇంకా దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గుర్తించిన ఈ కొత్త వేరియంట్ ను ఏవై 4.2 అని పిలుస్తారు. ఇప్పుడు ఈ వేరియంట్ యూకేలో 'పరిశోధన వేరియంట్'గా ప్రకటించబడింది. ఏవై 4.2 డెల్టా మ్యూటేషన్ పెరుగుతున్న క్రమంలో ఉత్పత్తి చేయబడిన అన్ని సీక్వెన్స్‌లలో దాదాపు 6 శాతం వాటాను కలిగి ఉందని ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది.

యూకే లోనూ ఏవై 4.2 రకం

యూకే లోనూ ఏవై 4.2 రకం

డెల్టా ప్రధాన రూపాంతరంగా మిగిలిపోయిందని, ఏవై 4.2గా కొత్తగా రూపాంతరం చెందిన డెల్టా యొక్క ఉప వంశం ఇంగ్లాండ్‌లో విస్తరిస్తున్నట్లు గుర్తించబడింది. ఏవై 4.2, "డెల్టా ప్లస్"గా పిలువబడింది. ఇప్పుడు యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) ద్వారా VUI-21OCT-01 అని పేరు పెట్టబడింది. ఇది ఆధిపత్య డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపించిందన్న తర్వాత ఇది నిశితంగా పరిశీలనలో ఉంది.
ఇండోర్ జిల్లాలో కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్లు ఆగస్టులో 64 శాతం పెరిగినప్పుడు డెల్టా వేరియంట్ ఉప-వంశం కోవిడ్ ఉప్పెనకు కారణమైందని ఎన్సీడీసీ నివేదిక పేర్కొంది.

 వ్యాక్సిన్స్ తీసుకున్న వారికీ కొత్త వేరియంట్

వ్యాక్సిన్స్ తీసుకున్న వారికీ కొత్త వేరియంట్

బాధితులంతా కోవిడ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ ఈ రకం వేరియంట్ వారికి కూడా సోకిందని, చికిత్స తరువాత వారు కోలుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఏవై 4.2 వైరస్ కరోనా వేరియంట్ కొత్త రకమని ఇండోర్లోని మైక్రోబయాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అనిత మూత వెల్లడించారు. ఏది ఏమైనా ఇప్పుడు దేశానికి కరోనా కొత్త వేరియంట్ భయం పట్టుకుంది. కరోనా డెల్టా వేరియంట్ కుటుంబానికి చెందిన కొత్త ఉత్పరివర్తనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

English summary
The new variant of the corona has caught the fear of India. There are AY 4.2 cases registered in Maharashtra and Madhya Pradesh. Currently there is concern over this variant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X