తబ్లిఘి జమాత్ హాజరై ఆస్పత్రిలో చేరిక: 6వ అంతస్తు నుంచి దూకే యత్నం(వీడియో)

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మత ప్రార్థనలకు హాజరై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం ఐసోలేషన్ వార్డు కిటికీలోంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే, వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది అతడ్ని కాపాడారు.

కరోనా బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడనే వార్త ఆస్పత్రిలో భయానక పరిస్థితి చోటు చేసుకుంది. కాగా, నిజాముద్దీన్ తబ్లిఘి జమాత్ మత సమ్మేళనానికి ఇతడు కూడా హాజరయ్యాడు. దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు పెరగడానికి ఈ సమ్మేళనం కారణం కావడం గమనార్హం.

corona: Tablighi Jamaat attendee attempts suicide from 6th floor of Delhi hospital

నార్త్ ఈస్ట్ ఢిల్లీ దిల్షద్ గార్డెన్‌లో ఉన్న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని కరోనావైరస్(కొవిడ్-19) బాధితులకు చికిత్స అందించేందుకు వినియోగిస్తున్నారు. నగరంలోని మరో నాలుగు ఆస్పత్రులు కూడా ఇలాంటి వైద్య సేవలను అందిస్తున్నాయి.

మంగళావారం ఉదయం బాధితుడు ఆస్పత్రిలో చేరాడని, దీంతో అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కరోనాపాజిటివ్ అనుమానితుడి చికిత్స తీసుకుంటున్న ఇతడు.. ఆస్పత్రి భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని చెప్పారు.

రోగికి గాలి అవసరం ఉండటంతో తాము కిటీకీలను మూసివేయలేదని తెలిపారు. బుధవారం 12.30గంటల ప్రాంతంలో బాధితుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని, వెంటనే వైద్య సిబ్బంది అతడ్ని అడ్డుకుని కాపాడారని చెప్పారు. ప్రత్యేక నిపుణులతో ఆ తర్వాత అతనికి సైకాలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+