Marriage: కొత్త పెళ్లి కొడుకు, లేడీస్ హాస్టల్, చీటీ రాసిచ్చి చీటీ చంపేసిన డాక్టర్లు !, పెళ్లి కూతురు ?
బెంగళూరు/ పశ్చిమ బెంగాల్: ఐటీ హబ్ బెంగళూరులో పేరుకు మాత్రమే బడాబడా ప్రైవేటు ఆసుపత్రుల్లో తూతూ మంత్రంగా కరోనా వైరస్ (COVID-19)కు చికిత్స చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని మరోసారి వెలుగు చూసింది. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకొన్న కొత్త పెళ్లి కొడుక్కి జ్వరం వచ్చింది. లేడీస్ పీజీ హాస్టల్ నిర్వహిస్తున్న పెళ్లి కొడుకు ఎందుకైనా మంచిదే అంటూ వైద్యపరీక్షలు చేయించుకోవడానికి ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. కొత్త పెళ్లి కొడుక్కి బ్లడ్ టెస్టులు ఏమాత్రం చెయ్యని ఆ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు అబ్బే.... నిమగే కరోనా ఇల్ల్వా కనో, మనేకి హోగి ఈ గోలిగళు తకోలి సాకు, అష్టే, ఎల్లా ప్రాబ్లమ్ హోగిబిడత్తా ( నీకు కరోనా లైదు చిన్నా, నువ్వు ఇంటికి వెళ్లి ఈ మాత్రలు వేసుకో, అన్ని సమస్యలు తీరిపోతాయి) అంటూ డబ్బులు మాత్రం తీసుకుని మాత్రల చీటీ రాసిచ్చి పంపించారు. ఇంటికి వెళ్లి మాత్రలు వేసుకుని నిద్రపోయిన కొత్త పెళ్లి కొడుకు ఉదయానికి అతను ఏకంగా యమలోకానికి వెళ్లిపోయాడు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్షం కారణంగా కొత్త పెళ్లి కూతురు, లేడీస్ పీజీ హాస్టల్ లోని అమ్మాయిలు ఇప్పుడు దేవుడా అంటూ ఆసుపత్రి పాలైనారు.

ఓటు వేశాడు...రెండు వారాల ముందు పెళ్లి
పశ్చిమ బెంగాల్ కు చెందిన రామ్ (35) అనే వ్యక్తి బెంగళూరు చేరుకుని బీటీఎం లేఔట్ లో సొంతంగా లేడీస్ పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నాడు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి నెల రోజుల క్రితం రామ్ కోల్ కత్తా వెళ్లాడు. రెండు వారాల క్రితమే ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి కోల్ కత్తాలో రామ్ పెళ్లి జరిగింది.

బెంగళూరులో కొత్త కాపురం
ఓటు హక్కు వినియోగించుకున్న రామ్ కొత్తగా పెళ్లి చేసుకుని వారం రోజుల పాటు కోల్ కత్తాలో ఉన్నాడు. తరువాత నవవధువును పిలుచుకుని బెంగళూరు చేరుకున్న రామ్ బీటీఎం లేఔట్ లో కొత్తగా కాపురం పెట్టి లేడీస్ పీజీ హాస్టల్ చూసుకుంటున్నాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న రామ్ దంపతులు రెండు వారాలు సంతోషంగా ఉన్నారు.

సార్...... జ్వరం వస్తోంది
శనివారం వేకువ జామున నుంచి రామ్ జ్వరంతో బాధపడుతున్నాడు. భార్య సలహామేరకు శనివారం ఉదయం రామ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి సార్, నాకు జ్వరం వస్తోందని, వైద్యపరీక్షలు, బ్లడ్ టెస్టులు చెయ్యాలని వైద్యులకు మనవి చేశారు. షరా మామూలే అన్నట్లు ఆ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం రామ్ దగ్గర ఫీజు వసూలు చేసుకుని తూతూ మంత్రంగా వైద్యపరీక్షలు చేసేశారు.

ఏనూ ఇల్లా కనో..... సుమ్నే హోగి రస్ట్ తగోళి
అబ్బే.... నిమగే కరోనా ఇల్ల్వా కనో, మనేగి హోగి ఈ గోలిగళు తకోలి సాకు, అష్టే, ఎల్లా ప్రాబ్లమ్ హోగిబిడత్తా ( నీకు కరోనా లైదు చిన్నా, నువ్వు ఇంటికి వెళ్లి ఈ మాత్రలు వేసుకో, అన్ని సమస్యలు తీరిపోతాయి) ఉంటూ డబ్బులు తీసుకుని మాత్రల చీటి రాసి ఇచ్చి పంపించారు. మెడికల్ స్టోర్ లో మాత్రలు తీసుకుని వెళ్లిన రామ్ శనివారం రాత్రి వరకు ఆ మాత్రలు వేసుకున్నాడు. హమ్మయ్యా నాకు కరోనా లేదు దేవుడా అంటూ ఊపిరిపీల్చుకున్న రామ్ శనివారం రాత్రి భార్యను మరో రూమ్ లోకి పంపించి మరో రూమ్ అతను నిద్రపోయాడు.

నిద్రలోనే ప్రాణం పోయింది
ఆదివారం ఉదయం రామ్ చాలా సేపు నిద్రపోతూనే ఉన్నాడు. అనారోగ్యంగా ఉండటంతో అలసటగా ఉంటుందని, ఇంకా కొంతసేపు నిద్రపోతే అంతా సరిపోతుందని రామ్ ను అతని భార్య నిద్రలేపలేదు. ఆదివారం ఎంతసేపు అయినా రామ్ నిద్రలేకపోవడంతో అతని భార్య వెళ్లి అతన్ని నిద్రలేవాలని చెప్పింది. అయితే రామ్ ప్రాణాలు పోయాయని తెలుసుకున్న అతని భార్య ఆర్తనాదాలు చేసింది. చుట్టుపక్కల వాళ్లు, పీజీ హాస్టల్ సిబ్బంది వెంటనే బీబీఎంపీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

80 శాతం ఆక్సిజన్ లెవల్స్
రామ్ కు కరోనా పాజిటివ్ అని బీబీఎంపీ వైద్య శాఖ అధికారుల వైద్యపరీక్షల్లో వెలుగు చూసింది. రామ్ శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ (అమ్లజనకం) శాతం చాలా తక్కువగా ఉన్నాయని, ఆ విషయం తెలిసినా ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం మాకు సమాచారం ఇవ్వలేదని, అందుకే సరైన సమయంలో అతనికి వైద్యం అందక చనిపోయాడని బీబీఎంపీ అధికారులు అంటున్నారు.

ఆసుపత్రిలో కొత్త పెళ్లి కూతురు.... లేడీస్ హాస్టల్ అమ్మాయిలు
కరోనా పాజిటివ్ తో కొత్త పెళ్లి కొడుకు రామ్ మరణించడంతో అతను నిర్వహిస్తున్న పీజీ హాస్టల్ లోని 16 మంది అమ్మాయిలు హడలిపోయారు, పీజీ హాస్టల్ లోని అమ్మాయిలు, అక్కడి సిబ్బందితో పాటు కొత్త పెళ్లి కూతురికి బీబీఎంపీ అధికారులు బ్లడ్ టెస్టులు చేసి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్షం కారణంగా కొత్త పెళ్లి కొడుకు ప్రాణాలు గాలిలో కలిసి పోవడం బెంగళూరులో కలకలం రేపింది. ఐటీ హబల్ లో కరోనా పాజిటివ్ తో కొన్ని రోజుల నుంచి అమాయకుల పిట్టల్లా రాలిపోతున్నాయని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications