Coronavirus: బెంగళూరులో ఒక్కడి దెబ్బకు 188 మంది క్వారంటైన్, 9 పాజిటివ్, కాలనీ ఖాళీ, దేవుడా !

బెంగళూరు: దేశం మొత్తం కరనా వైరస్ (COVID 19) దెబ్బకు లాక్ డౌన్ అమలు చేశారు. ఐటీ బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన సిలికాన్ సిటి బెంగళూరులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బెంగళూరులోని హోంగసంద్రలో బీహారి దెబ్బకు ఇప్పటికే 188 మంది కరోనా క్వారంటైన్ కు వెళ్లారు. బీహారికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో అతని నుంచి మరో 9 మందికి కరోనా సోకిందని వైద్యులు నిర్దారించడంతో బీబీఎంపీ అధికారులు అలర్ట్ అయ్యారు. బీహారీల దెబ్బకు హోంగసంద్రలోని ఓ కాలనీ మొత్తం ఖాళీ అయ్యింది. రాత్రికిరాత్రి ఆపరేషన్ హోంగసంద్రకు శ్రీకారం చుట్టిన అధికారులు 24 వాహనాల్లో అందర్ని క్వారంటైన్ కు తరలించారు. అందరికీ కరోనా వైద్యపరీక్షలు చేయిస్తున్నామని బీబీఎంపీ అధికారులు అంటున్నారు.

విద్యాజ్యోతి కాలనీలో కలకలం

విద్యాజ్యోతి కాలనీలో కలకలం

బెంగళూరు నగరంలోని హోంగసంద్రలోని విద్యాజ్యోతి కాలనీలో వందల మంది బీహారీలు నివాసం ఉంటున్నారు. విద్యాజ్యోతి కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని అధికారులు గుర్తించారు. విద్యాజ్యోతి కాలనీలో నివాసం ఉంటున్న బీహారీలకు ఎంత మందికి కరోనా వైరస్ వచ్చింది ? అంటూ బీబీఎంపీ, వైద్యశాఖ అధికారులు ఆరా తీశారు.

ఫస్ట్ రౌండ్ పరీక్షల్లో 9 మందికి కరోనా

ఫస్ట్ రౌండ్ పరీక్షల్లో 9 మందికి కరోనా

విద్యాజ్యోతి కాలనీలో నివాసం ఉంటున్న ఓ బీహారికి కరోనా వైరస్ సోకిందని నిర్దారణ కావడంతో బీబీఎంపీ అధికారులు అప్రమత్తం అయ్యారు. బీహారితో కలిసి నివాసం ఉంటున్న వారిని, ఆ ప్రాంతంలో అతనితో సన్నిహితంగా ఉన్న వారికి కరోనా వైద్యపరీక్షలు నిర్వహించారు. ఫస్ట్ రౌండ్ కరోనా పరీక్షల్లో 9 మందికి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో అధికారులు షాక్ కు గురైనారు.

కరోనా క్వారంటైన్ కు 188 మంది

కరోనా క్వారంటైన్ కు 188 మంది

ఒక్క వ్యక్తి వలన 9 మందికి ఇప్పటికే కరోనా పాజిటివ్ అని తేలడంతో హడలిపోయిన అధికారులు రాత్రికి రాత్రి 24కు పైగా టీటీ వాహనాలు విద్యాజ్యోతి కాలనీకి తీసుకెళ్లి బీహారిలతో సన్నిహితంగా ఉంటున్న సుమారు 188 మందికి పైగా స్థానికులను, అక్కడ నివాసం ఉంటున్న వారిని ఆ వాహనాల్లో కరోనా క్వారంటైన్ కు తరలించారు.

రింగరింగా అంటూ తిరిగేశాడు

రింగరింగా అంటూ తిరిగేశాడు

విద్యాజ్యోతి నగరలో నివాసం ఉంటూ కరోనా వ్యాధి సోకిన వ్యక్తితో కలిసి 10 మందికిపైగా ఒకేచోట నివాసం ఉంటున్నారని, వారిలో ఇప్పటికే 9 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని అధికారులు అంటున్నారు. మొదట కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆ ప్రాంతంలోని కిరాణా షాపులు, రోడ్లు, అంగళ్లతో పాటు పరిసర ప్రాంతాలు మొత్తం తిరిగేశాడని, అతని ట్రావెల్ హిస్టరీ మొత్తం సేకరించామని అధికారులు అంటున్నారు.

ఒక్కడి దెబ్బకు కాలనీ మొత్తం ఖాళీ, సీల్ డౌన్ !

ఒక్కడి దెబ్బకు కాలనీ మొత్తం ఖాళీ, సీల్ డౌన్ !

విద్యాజ్యోతి కాలనీలో నివాసం ఉంటున్న బీహారిలకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో కాలనీ మొత్తం ఖాళీ అయ్యిందని అధికారులు అంటున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటూ బీహారీలతో సన్నిహితంగా కలిసిమెలసి ఉన్న దాదాపు 188 మందిని కరోనా క్వారంటైన్ కు తరలించామని అధికారులు అంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన బీహారీలు ఎవరెవరిని కలిశారు ? ఎక్కడెక్కడ తిరిగారు ? ఎంత మందితో సన్నిహితంగా ఉన్నారు ? అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు.

Recommended Video

    Coronavirus: COVID-19 Cases Reached 893 Mark In AP With 80 New Cases
    లాక్ డౌన్ సడలిస్తే ఇలాగేనా ?

    లాక్ డౌన్ సడలిస్తే ఇలాగేనా ?

    కరోనా లాక్ డౌన్ నియమాలు సడలించిన ప్రాంతాల్లో పనులు చేస్తున్న వారు సమదూరం పాటించాలని ఇప్పటికే తాము సూచించామని, ఆ ప్రాంతాల నుంచి కరోనా పాజిటివ్ కేసులు రావడం లేదని కర్ణాటక వైద్య, విద్యాశాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ అంటున్నారు. కరోనా క్వారంటైన్ లు ఉన్న ప్రాంతాల్లోనే కరోనా వ్యాధి కేసులు వస్తున్నాయని, వాటిని అరికట్టడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని మంత్రి డాక్టర్ సుధాకర్ ప్రజలకు హామీ ఇచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+