Coronavirus: చైనీయుల విసాలన్నీ రద్దు చేసిన భారత్: విమానం ప్రయాణంపై నిషేధం

న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటించడానికి చైనీయులకు జారీ చేసిన విసాలన్నింటినీ మనదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మరణించిన చైనీయులు సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతుండటం, వేలాదిమందిలో కరోనా వైరస్ జాడ కనిపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారత్.. ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వైరస్ సోకిన చైనీయులు భారత్‌కు బయలుదేరి వచ్చే అవకాశాలు ఉన్నందున విసాలన్నింటినీ రద్దు చేసింది.

Recommended Video

    Coronavirus : Andhra Girl Jyothi Seeking For Help In China | పది రోజుల్లో పెళ్లి.. ఇంతలో చైనా వెళ్లి

    ఈ విషయాన్ని చైనాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రబలిపోవడానికి ముందే విసాలను పొంది ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్న చైనీయుల విసాలు కూడా రద్దయినట్లుగానే భావించాలని పేర్కొన్నారు. ఇదివరకే మంజూరు చేసిన విసాలన్నీ రద్దయ్యాయని, కొత్త విసాల కోసం బీజింగ్, షాంఘై, గ్వాంగ్ఝౌ నగరాల్లో ఉన్న భారత రాయబార, కాన్సులేట్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.

    Coronavirus: Existing Visas No Longer Valid For Passengers From China

    ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్న చైనీయులు తమదేశ రాయబార కార్యాలాయన్ని వెంటనే సంప్రదించాలని ఆదేశించారు. కిందటి నెల 15వ తేదీ తరువాత చైనా నుంచి భారత పర్యటనకు వచ్చిన వారంతా వెంటనే కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయం హాట్ లైన్ నంబర్ +91-11-23978046ను సంప్రదించాలని అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం.. నడుచుకోవాల్సి ఉంటుందని, సమీప ఆసుపత్రుల్లో తప్పనిసరిగా వైద్య పరీక్షలను చేయించుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

    దీనితోపాటు- కరోనా వైరస్ బారిన పడిన చైనా నుంచి ఏ ఒక్క చైనీయుడిని గానీ, ఇతర విదేశీ ప్రయాణికుడిని గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కించుకోవద్దంటూ మనదేశ పౌర విమానయాన సంస్థలకు కూడా కఠిన ఆదేశాలను జారీ చేశారు. భారత్-చైనా మధ్య రాకపోకలు సాగిస్తోన్న ప్రతి పౌర విమానయాన సంస్థ కూడా ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని అన్నారు. కరోనా వైరస్ సోకిన చైనీయులను గుర్తించడం కష్టతరమైనందున.. ఇదివరకే విసాలు పొందిన వారిని ప్రయాణించడాన్ని నిరాకరించాలని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+