కరోనాను జయించిన కనిక, ఆరోసారి పరీక్షలో నెగిటివ్, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్, ఫ్యామిలీ హ్యాపీ...
హమ్మయ్యా.. బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ కరోనా వైరస్ రక్కిసి నుంచి బయటపడ్డారు. ఆమెకు ఆరోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. దీంతో కనికకపూర్ సహా కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే లక్నోలో గల సంజయ్ గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. గతనెలలో లండన్ నుంచి తిరిగొచ్చాక కనికకపూర్‌కు వైరస్ సోకింది. అయితే ఆమె క్వారంటైన్‌లో ఉండకుండా పార్టీలకు వెళ్లడంతో వివాదం చెలరేగింది. తర్వాత సంజయ్ గాంధీ ఆస్పత్రి సిబ్బందితో గొడవపడ్డారు. రోగిలా కాకుండా స్టార్ మాదిరిగా బీహెవ్ చేస్తున్నారని స్టాప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Recommended Video

లండన్ నుంచి రావడంతోనే..
కనిక కపూర్ మార్చి 9వ తేదీన లండన్ నుంచి ముంబై వచ్చారు. ఆ తర్వాత లక్నో వెళ్లి.. పార్టీలకు కూడా హాజరయ్యారు. అక్కడ బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే కూడా హాజరయ్యారు. ఆమెకు కరోనా వైరస్ సోకిందని తేలడంతో దుష్యంత్.. వసుంధర సెల్ప్ క్వారంటైన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. క్వారంటైన్‌లోకి వెళ్లకుండా కనిక.. బయట తిరగడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఆమెకు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా అండగా నిలిచారు. ఆమెను కూడా నెటిజన్లు ఏకీపారేశారు.

మార్చి 20 నుంచి ఐసోలేషన్..
కనికకు కరోనా సోకడంతో మార్చి 20వ తేదీన లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకు తీసుకొచ్చారు. ఇక ఆస్పత్రి సిబ్బందితో కనిక గొడవ పడ్డారు. తనకు సరైన వసతులు కల్పించలేదని.. స్టాప్‌పై మాటల యుద్ధానికి దిగారు. ఇందుకు ధీటుగా ఆస్పత్రి యాజమాన్యం కూడా స్పందించింది. కానీ తర్వాత వారి మధ్య స్తబ్దత తొలగింది. మార్చి 20వ తేదీ నుంచి కనిక కపూర్‌కు కరోనా పరీక్షలు చేస్తూనే ఉన్నారు. ఇదివరకు చేసిన ఐదుసార్లు కూడా పాజిటివే వచ్చింది.

హమ్మయ్యా...
ఆరోసారి నెగిటివ్ రావడంతో కనిక సహా ఫ్యామిలీ ఊపిరి పీల్చుకున్నారు. ఐదు సార్లు పాజిటివ్ వచ్చిన సందర్భంలో కనిక.. సోషల్ మీడియోలో పోస్ట్ నెక్ట్స్ టైం... నెగిటివ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె ఊహించినట్టే, ఆరోసారి నెగిటివ్ వచ్చింది. గత కొద్దిరోజుల నుంచి ఫ్యామిలీ మిస్ అవుతున్నానని.. వారిని కలవడంపై ఆమె ఆనందానికి అవధి లేకుండా పోయింది.
Singer Kanika Kapoor has been discharged from Sanjay Gandhi Postgraduate Institute of Medical Sciences (SGPGIMS), Lucknow after the report of her sixth test, came negative. (file pic) pic.twitter.com/LpWEuHyLls
— ANI UP (@ANINewsUP) April 6, 2020
-
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్‌ఫర్డ్‌లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications