Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Coronavirus: మంత్రి ఫ్యామిలీలో ముగ్గురికి కరోనా, ఇల్లు సీల్ డౌన్, పక్కనే పవర్ స్టార్ ఫ్యామిలీ !

బెంగళూరు: మంత్రి ఫ్యామిలీలో ముగ్గురికి కరోనా వైరస్ (COVID 19) వ్యాధి సోకడంతో అందరూ షాక్ కు గురైనారు. మంత్రితో పాటు ఆయన ఇద్దరు కుమారులు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. మంత్రి భార్య, కుమార్తె, తండ్రికి ప్రస్తుతం ఆసుపత్రిలో కరోనా వైరస్ వ్యాధి నయం కోసం చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి నివాసం ఉంటున్న ఇంటిని వైద్య శాఖ అధికారులు సీల్ డౌన్ చేశారు. శ్రీమంతులు, పవర్ స్టార్ తో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతంలో మంత్రి ఇల్లు ఉండటంతో పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురుకాకుండా మంత్రి ఇంటిని సీల్ డౌన్ చెయ్యాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ నిర్ణయంతీసుకున్నారు. అయితే మంత్రి అదే వైద్య, విద్యశాఖ మంత్రిగా ఉండటం, స్వతహాగా ఆయన వైద్యుడు కావడం విశేషం.

 మంత్రి అడ్డాలో 90% తెలుగు

మంత్రి అడ్డాలో 90% తెలుగు

కర్ణాటక వైద్య విద్యాశాఖా మంత్రిగా ఉన్న డాక్టర్ సుధాకర్ స్వతహాగా వైద్యుడు. కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని జాతీయరహదారిలోని చిక్కబళ్లాపురం నియోజక వర్గం ఎమ్మెల్యేగా మంత్రి డాక్టర్ సుధాకర్ గెలుపోందారు. చిక్కబళ్లాపురంలో 90 శాతం మంది తెలుగులోనే మాట్లాడుతుంటారు. చిక్కబళ్లాపురం కర్ణాటకలో ఉన్నా ఆ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడుతుంటారు.

 మంత్రి తండ్రికి కరోనా

మంత్రి తండ్రికి కరోనా

కర్ణాటక వైద్య విద్యాశాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ తండ్రి (82) ఇటీవల అనారోగ్యానికి గురైనారు. వెంటనే మంత్రి సుధాకర్ తండ్రికి వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల్లో మంత్రి డాక్టర్ సుధాకర్ తండ్రికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. తన తండ్రికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిందని, కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం తన తండ్రికి ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందిస్తున్నామని మంత్రి డాక్టర్ సుధాకర్ ఇప్పటికే స్పష్టం చేశారు.

 మంత్రి భార్య, కూతురిని వెంటాడిన కరోనా

మంత్రి భార్య, కూతురిని వెంటాడిన కరోనా

కర్ణాటక మంత్రి డాక్టర్ సుధాకర్ తండ్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు అందరూ హడలిపోయారు. వెంటనే మంత్రి డాక్టర్ సుధాకర్, ఆయన భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులకు, ఇంట్లో పని చేస్తున్న సిబ్బందికి వైద్యపరీక్షలు చేశారు. వైద్యపరీక్షల్లో మంత్రి డాక్టర్ సుధాకర్ భార్య, కుమార్తెకు కరోనా అని వెలుగు చూసింది. మంత్రి డాక్టర్ సుధాకర్ తో పాటు ఆయన ఇద్దరు కుమారులకు కరోనా నెగటివ్ అని వచ్చింది.

 సొంత పనిమనిషి దెబ్బ

సొంత పనిమనిషి దెబ్బ

కర్ణాటక మంత్రి డాక్టర్ సుధాకర్ ఇంట్లో పని చేస్తున్న వంట మనిషి వలన ఆయన కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. వంట మనిషి ఇంట్లో వంటలు చెయ్యడం, వాటిని మంత్రి డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులు ఆరగించడం వలనే ఆయన కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి కరోనా వైరస్ సోకిందని వైద్యులు, అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 బెంగళూరులో మంత్రి ఇల్లు సీల్ డౌన్

బెంగళూరులో మంత్రి ఇల్లు సీల్ డౌన్

బెంగళూరులోని సదాశివనగర్ ప్రాంతంలో మంత్రి డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. సదాశివనగర్ లో మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎమ్. కృష్ణ, కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో పాటు అనేక మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు నివాసం ఉంటున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కర్ణాటక వైద్య, విద్యాశాఖా మంత్రి డాక్టర్ సుధాకర్ ఇంటిని సీల్ డౌన్ చేశామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Recommended Video

    కొంపముంచిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌.. టెన్నిస్ స్టార్ Novak Djokovic కు Corona!
     రెండో సారి క్వారంటైన్ లో మంత్రి

    రెండో సారి క్వారంటైన్ లో మంత్రి

    గతంలో ఓ మీడియా సమావేశంలో మంత్రి డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. ఆ మీడియా సమావేశంలో పాల్గొన్న ఓ ప్రముఖ టీవీ చానల్ కెమెరా మెన్ కు కరోనా పాజిటివ్ అని రావడంతో అప్పట్లో మంత్రి డాక్టర్ సుధాకర్ తో పాటు, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ, హోమ్ శాఖా మంత్రి బసవరాజ్ బోమ్మయ్ 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఇప్పుడు భార్య, కుమార్తె, తండ్రికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో మంత్రి డాక్టర్ సుధాకర్ మరోసారి హోమ్ క్వారంటైన్ కు వెళ్లారు. తన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని దేవుడి ప్రార్థిస్తూ తనకు ధైర్యం చెబుతున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అని మంత్రి డాక్టర్ సుధాకర్ తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+