కరోనా: కనికకపూర్‌కు ఐదోసారి పాజిటివ్, 9వ తేదీ నుంచి 20 వరకు ఏం జరిగింది: ఫ్యామిలీ మెంబర్స్
బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ కరోనా పాజిటివ్‌తో పోరాడుతోన్నారు. గత నెల 20వ తేదీన ఆమెకు పాజిటివ్ వచ్చిందని తేలడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. గత నెల 31వ తేదీన కనికకు ఐదోసారి కరోనా పరీక్ష చేశారు. ఆ పరీక్షలో కూడా ఆమెకు పాజిటివ్ వచ్చింది. కనికాకు నెగిటివ్ వచ్చేవరకు ఇక్కడే చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు. వాస్తవానికి మొదట వైద్యులతో కనికకపూర్ గొడవపడ్డారు. కానీ ఇప్పుడు తమకు సహకరిస్తోందని.. త్వరలో ఆమెకు నెగిటివ్ వస్తోందని భావిస్తున్నారు.

ఐదోసారి పాజిటివ్..
వైరస్ సోకి ఆస్పత్రిలో కనిక కపూర్ చికిత్స పొందుతుండగా.. ఐదోసారి కూడా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 20 నుంచి 31వ తేదీ వరకు ఏం జరిగింది..? కనికకు వైరస్ ఎలా సోకిందనే అంశంపై ఆమె కుటుంబసభ్యులు ‘ఇండియా టుడే' టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు. కనికకపూర్ లండన్ నుంచి మార్చి 9వ తేదీన ముంబై వచ్చారని.. అక్కడినుంచి 11వ తేదీన లక్నో వచ్చారని పేర్కొన్నారు. అక్కడ పలు పార్టీలకు హాజరైన ఆమె జ్వరం రావడంతో 17వ తేదీన డోలో టాబ్లెట్ వేసుకున్నారు. మాత్ర వేసుకోవడంతో జ్వరం 100.8 ఫారిన్ హీట్ నుంచి తగ్గింది. కానీ తర్వాత ఫివర్ తగ్గకపోవడంతో వైరస్ వచ్చిందా అని అనుమానించారు.

సెల్ఫ్ ఐసోలేషన్ కూడా..
లాభం లేదనుకొని రెండురోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. అయినా జర్వరం తగ్గకపోవడంతో 19వ తేదీన వైద్యులను పిలిపించారు. రక్త నమునాలను సేకరించి.. పరీక్షల కోసం పంపించారు. ఆ మరునాడు రిపోర్టులో కనికాకు కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. ఆమెను వెంటనే లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి చికిత్స కొనసాగుతూనే ఉంది. మార్చి 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఐదుసార్లు కరోనా వైరస్ పరీక్షలు చేయగా.. పాజిటివ్ రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన చెందుతున్నారు.
Recommended Video

వైద్య సిబ్బందితో గొడవ..
సంజయ్ గాంధీ ఆస్పత్రి సిబ్బందిపై కనికకపూర్ గొడవపడ్డారు. తన గది శుభ్రంగా లేదని, సరైన సౌకర్యాలు లేవని పెదవి విరిచారు. ఓ రోగికి అందించాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నామని, కానీ ఆమె స్టార్ మాదిరిగా ప్రవర్తిస్తున్నారని హాస్పిటల్ యాజమాన్యం కూడా మండిపడింది. కానీ ఇప్పుడు కనిక తీరు మారిందని.. ఆమెకు వైరస్ తగ్గేవరకు చికిత్స అందించి పంపిస్తామని తెలిపారు. మరోవైపు కనిక కపూర్‌కు వైరస్ పదిరోజుల తర్వాత బయటపడిందని.. ఆ 10 రోజులు కూడా ఆమె ఎవరితో దగ్గరగా లేదని, సోషల్ డిస్టన్స్ పాటించారని కుటుంబసభ్యులు చెప్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications