వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను సీఎంకు లంచం ఇచ్చాను: సరిత (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

కొచ్చి: కేరళలోని యూడీఎఫ్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోలార్ స్కామ్ తో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రుల మెడకు చుట్టుకున్న సోలార్ స్కామ్ ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపైకి మళ్లింది.

కేరళలో మెగా సోలార్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి గాను అనుమతుల కోసం సీఎం ఊమెన్ చాందీ కీలక అనుచరుడికి రూ. 1.9 కోట్లు ఇచ్చానని ఈ కేసులో ప్రధాన నిందితురాలు సరిత ఆరోపించారు. ఊమెన్ చాందీకి ఈ కేసులో సంబంధం ఉందని ఆమె అంటున్నారు.

ఈ కేసు విచారిస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు ప్రధాన నిందితురాలు సరిత వాంగ్మూలమిచ్చారు. అదే విధంగా ఊమెన్ చాందీ మంత్రి కేబినెట్ లోని విద్యుత్ శాఖ మంత్రి అర్యదన్ మహమ్మద్ పీఏకి రూ. 40 లక్షలు ఇచ్చానని సరిత వెల్లడించారు.

రూ. 7 కోట్లు అడిగారు

రూ. 7 కోట్లు అడిగారు

కేరళలో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చెయ్యాలంటే రూ. 7 కోట్లు ఇవ్వాలని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మాజీ పీఏ జిక్కుమన్ అడిగారని సరిత అంటున్నారు.

ఢిల్లీలో ఇవ్వాలని చెప్పారు

ఢిల్లీలో ఇవ్వాలని చెప్పారు

ఈ నగదు మొత్తం ఢిల్లీలో ఉంటున్న సీఎం ఊమెన్ చాందీ అనధికారిక అనుచరుడు థామస్ కురువిల్లాకు ఇవ్వాలని జిక్కుమన్ చెప్పారని సరిత ఆరోపిస్తున్నది.

రూ.1.10 కోట్లు ఇచ్చా

రూ.1.10 కోట్లు ఇచ్చా

చాందినీ చౌక్ షాపింగ్ మాల్ పార్కింగ్ గ్రౌండ్ లో థామస్ కురువిల్లాకు రూ. 1.10 కోట్లు ఇచ్చానని సరిత ఆరోపిస్తున్నది.

సీఎం ఊమెన్ చాందీని కలిశాను

సీఎం ఊమెన్ చాందీని కలిశాను

2012 డిసెంబర్ 27వ తేది తాను విమానాశ్రయానికి వెలుతున్న సమయంలో విజ్ఞాన్ భవన్ లో ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కలిశానని సరిత అంటున్నారు.

ఎంత వరకు వచ్చిందని అడిగారు

ఎంత వరకు వచ్చిందని అడిగారు

సోలార్ ప్రాజెక్టు పనులు ఎంత వరకు వచ్చాయని అదే సందర్బంలో ఊమెన్ చాందీ తనను అడిగి తెలుసుకున్నారని సరిత చెప్పారు.

సమస్యలు ఉన్నాయి

సమస్యలు ఉన్నాయి

తాను అప్పులు చేసి నగదు తీసుకు వచ్చి మీకు ఇస్తున్నానని, వెంటనే అనుమతులు ఇచ్చి మమల్ని సమస్యల నుంచి బయటపడేయాలని తాను అప్పుడే సీఎంకు చెప్పానని సరిత అంటున్నది.

మాకు సంబంధం లేదు

మాకు సంబంధం లేదు

కేసు తప్పుదోవ పట్టించడానికి ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేరళ సీఎం ఊమెన్ చాందీ, మంత్రి ఆర్యదన్ అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న మరో మంత్రి కే. బాబు మళ్లీ రాజీనామా చేసి లేఖను సీఎం ఊమెన్ చాందీకి పంపించారు.

English summary
Chief Minister Oommen Chandy told reporters in a cabinet briefing that he was yet to discuss the issue with his colleagues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X