అక్కడ తేలిన నిత్యానంద: ఏకంగా దేశమే: ప్రత్యేక పాస్ పోర్టు..జాతీయ చిహ్నంగా ఆయన రూపం!
బెంగళూరు: అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామి నిత్యానంద.. ఓ సొంత దేశాన్నే సృష్టించుకున్నాడు. ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో తిష్ట వేశాడు. ఆ ద్వీపాన్ని హిందూ దేశంగా ప్రకటించాడు. ఆ దేశం పేరు కైలాస. దీనికోసం ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించారు. https://www.kailaasa.org. కైలాస దేశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు. అత్యాచార ఆరోపణలపై గుజరాత్ హైకోర్టులో పిటీషన్ దాఖలైన తరువాత కనిపించకుండా పోయిన నిత్యానంద.. ఆ దేశంలో తేలాడు.
Recommended Video

ఆ దేశానికి వెళ్లాలంటే.. ప్రత్యేక పాస్ పోర్టు..
నిత్యానంద సృష్టించినట్లుగా చెబుతోన్న ఆ దేశానికి వెళ్లాలంటే ప్రత్యేక పాస్ పోర్ట్ అవసరం అవుతుందట. జాతీయ పతాకాన్ని, జాతీయ ధ్వజాన్ని సైతం రూపొందించుకున్నారు. తాను ధ్యానంలో కూర్చున్న ఫొటోను జాతీయ చిహ్నంగా ప్రకటించారు. ‘కైలాస' దేశాన్ని గుర్తించాలని కోరుతూ నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆ వెబ్ సైట్ లో పొందుపరిచారు. ప్రపంచంలో హిందూ దేశాల సంఖ్య తగ్గుతోందని, అందుకే తాను కైలాస పేరుతో ప్రత్యేకంగా ఓ దేశాన్ని సృష్టించాల్సి వచ్చిందని నిత్యానంద ఉటంకించినట్లు వెబ్ సైట్ చెబుతోంది.

పౌరసత్వం కావాలంటే..
కైలాస దేశంలో పౌరసత్వం పొందాలంటే భారీగా విరాళాలను సమర్పించుకోవాల్సి ఉంటుందనే నిబంధన పెట్టారు. ఎంత భారీగా విరాళాలను అందజేస్తే.. అంత విలాసవంతంగా ఆ దేశంలో జీవనాన్ని గడప వచ్చట. ఇతర దేశాలకు చెందిన వారు అక్కడ భూములను సైతం కొనుగోలు చేయడానికి వీలు కల్పించినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా భూముల ధరలను నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అన్నీ ఉచితమే..
కైలాస దేశంలో ఆకలి అనేదే తెలియకుండా చేస్తామని వెబ్ సైట్ పేర్కొన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని, అన్నార్తులకు భోజనాన్ని ఉచితంగా అందజేస్తామని వెల్లడించారు. ఆధ్యాత్మిక భావనలతో కూడిన విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలను కల్పించుకోవడానికి మాత్రమే తమ దేశ పౌరులు పన్నులను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి నుంచి గుర్తింపు లభించిన వెంటనే అనేక విప్లవాత్మక చర్యలను చేపట్టబోతున్నట్లు చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications