చీటీల వ్యాపారం, రూ. 5 కోట్లు అప్పులు, జైలు జీవితం, పాపను వదిలేసి దంపతుల ఆత్మహత్య !

చీటీల వ్యాపారంలో రూ. ఐదు కోట్ల వరకు అప్పులు కావడంతో వాటిని తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా కోరటగెరె పట్టణంలో జరిగింది.

బెంగళూరు: చీటీల వ్యాపారంలో రూ. ఐదు కోట్ల వరకు అప్పులు కావడంతో వాటిని తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా కోరటగెరె పట్టణంలో జరిగింది. రవి, ప్రభా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

రవి, ప్రభా దంపతులకు ఒక పాప ఉంది. రవి, ప్రభా దంపతులు చీటీల వ్యాపారం చేశారు. వందల మంది రవి, ప్రభా దంపతులను నమ్మి చీటీలు వేశారు. గడుపు పూర్తి అయినా చీటీలు వేసిన వారికి రవి, ప్రభా దంపతులు డబ్బులు చెల్లించలేదు. దాదాపు 100 మందికి పైగా రూ. ఐదు కోట్ల వరకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంది.

 Coupl commits suside near Tumakuru in Karnataka

చీటీలు వేసిన వారు కొందరు డబ్బు తిరిగి చెల్లించలేదని పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో రవి, ప్రభా దంపతులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవల రవి, ప్రభా దంపతులు జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారు. చీటీలు వేసిన వారు ఒత్తిడి చెయ్యడంతో తట్టుకోలేకపోయారు.

సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత రవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గుర్తించిన ప్రభా విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. చీటీలు వేసిన వారి సొమ్ము స్వాహా చేసిన రవి, ప్రభా దంపతులు నాలుగు అంతస్తుల భవనం నిర్మించుకుని కారు తీసుకుని విలాసవంతమైన జీవితం గడిపారని, చివరికి ఇలా ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+