• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ జంట బరితెగింపు: ముంబైలో రోడ్ డివైడర్‌పై కూర్చునే..

|

ముంబై: పట్టపగలు నడిరోడ్డుపై ఓ జంట వికృతచేష్టలకు దిగింది. వేలాది మంది సేదతీరే ముంబై మెరైన్‌ డ్రైవ్‌ రోడ్డులోని డివైడర్‌పైనే ఆ జంట శృంగారంలో పాల్గొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

 ఇంత బరితెగింపా?

ఇంత బరితెగింపా?

ముంబైలో నిత్యం వేలమంది సేదతీరే మెరైన్‌ డ్రైవ్‌(క్వీన్స్‌ నెక్లెస్‌) రోడ్డుపై ఓ విదేశీయుడు, భారత మహిళ అసభ్యచర్యకు పాల్పడ్డారు. పట్టపగలు, రోడ్డుమీద వాహనాలు రద్దీని, వందలాది జనాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయారు.

 అంతా షాక్

అంతా షాక్

కాగా, ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైన వారిలో చాలా మంది సెల్‌ఫోన్లు తీసి వీడియోలు తీయగా, ఇంకొందరు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నిమిషాల వ్యవధిలోనే పోలీస్‌ మొబైల్‌ వ్యాన్‌ అక్కడికి చేరుకుంది. ఖాకీలను చూసిన ఆ జంట పారిపోయే ప్రయత్నం చేసింది.

ఆ జంట కోసం వేట

పోలీసులు రోడ్డు దాటి వచ్చే లోపే సదరు విదేశీయుడు పారిపోయాడు. మహిళ మాత్రం పోలీసులకు దొరికిపోయింది. తనది గోవా అని, రోడ్డు మీద ముద్దు మాత్రమే పెట్టుకున్నామని పోలీసులతో ఆమె చెప్పింది. పదే పదే ఒంటిమీది దుస్తులను తీసేస్తూ మతిస్థిమితంలేని దానిలా ప్రవర్తించింది. డ్రగ్‌ అడిక్ట్‌ లేదా సైకోగా భావిస్తోన్న ఆమెను మహిళా సురక్ష కేంద్రానికి తరలించారు పోలీసులు. ఆమె వివరాలు, పరారైన విదేశీయుడు ఎవరనేది గుర్తించేందుకు పోలీసులు ఆపరేషన్‌ చేపట్టారు. మెరైన్‌ డ్రైవ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడంతోపాటు, దగ్గర్లోని హోటళ్లలో బసచేసిన విదేశీయుల వివరాలను సేకరిస్తున్నారు.

భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం

భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం

శనివారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాలకు ముంబై మహానగరం, శివారులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం ఉదయం నాటికి వర్షపాతం సరాసరి 100 మిల్లీమీటర్లుగా నమోదయింది. దాదర్‌, పరేల్‌ టీటీ, ధారావి, కింగ్స్‌ సర్కిల్‌, కోలాబా, సియోన్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్టు విరిగి తలపై పడటంతో 13 ఏళ్ల బాలిక, గోడకూలి మరో ఇద్దరు దుర్మరణం చెందారు. భారీ వర్షానికి రోడ్డు కనిపించక లారీ డ్రైవర్‌ స్కూటీని ఢీకొట్టిన ఘటనలో మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. వర్షాభావ పరిస్థితిని చక్కదిద్దేందుకు బృహన్‌ ముంబై కార్పొరేషన్‌(బీఎంసీ), నేవీ, విపత్తు నిర్వహణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

English summary
Undeterred by passing cars and pedestrians, a young couple allegedly had sex on a road divider in south Mumbai's posh Marine Drive area at Nariman Point on Thursday, news agency IANS reported. Hundreds of people watched, clicked photos and filmed the bizarre incident as cars sped by at a busy hour of the day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X