దారుణం: దంపతులను హత్యచేసి ముక్కలుగా కోసి ఆపై....
పశ్చిమ బెంగాల్ : పశ్చిమబెంగాల్‌లో దారుణం జరిగింది. భార్యాభర్తలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతి చెందిన వారిని ప్రదీప్ అల్పనా బిస్వాస్‌గా గుర్తించారు. సౌత్ 24 పరగనాస్ జిల్లాలోని ఓ ఇంట్లో ఈ మృతదేహాలు పడిఉన్నాయి. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలు పడి ఉన్న ఇంటికి దంపతులు కేర్‌టేకర్‌లుగా పనిచేస్తున్నారు.ఇదిలా ఉంటే ఇంటి యజమానీ చాలా అరుదుగా వచ్చి వెళుతుంటారని అయితే మృతి చెందిన ప్రదీప్, అల్పనాలతో నిత్యం ఫోన్‌లో టచ్‌లో ఉంటారని పోలీసులు తెలిపారు. రెండ రోజులుగా ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని ప్రదీప్ సోదరుడు జాయ్‌కు ఫోన్ చేశాడు.
ఏమి జరిగిందో తెలుసుకునేందుకు జాయ్ ఇంటికి చేరుకోగా అక్కడ రెండు సూట్‌కేసులు బాత్రూంలో కనిపించాయి. సూట్‌కేసులో నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు కబురు చేశాడు. పోలీసులు చేరుకుని సూట్‌కేసును తెరువగా తన దంపతుల మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు పోలీసులు. హత్య జరిగిన ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. డాగ్ స్క్వాడ్ కూడా చేరుకుని దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు కూడా చేరుకుని ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

వెస్ట్ బెంగాల్‌లోని నరేంద్ర పూర్‌లో జంటహత్యలు జరిగి ఒక రోజు కూడా గడవకముందే మరో దంపతుల హత్య జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నేతాజీ నగర్‌లోని రెండంతస్తుల భవనంలో ఈ వృద్ధ దంపతులు చనిపోయి కనిపించారు. మృతులను దిలీప్, సప్నా ముఖర్జీలుగా గుర్తించారు. భార్య గొంతుకు తాడు కట్టి ఆమెను గుమ్మం దగ్గర పడేశారు దుండగులు. గొంతులోకి ఓ పైపును కూడా దూర్చారు. మరోవైపు భర్త మృతదేహం బెడ్‌రూంలో కనిపించింది. అయితే ప్రాథమిక విచారణ ప్రకారం ముగ్గురు ఆగంతకులు దోచుకునేందుకు వచ్చి ఈ వృద్ధ దంపతులను హత్య చేసి ఉంటారని తెలుస్తోంది.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications