కారులో శృంగారం ప్రియుడి ప్రాణం తీసింది
ఫిలిబిత్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిబిత్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ కూడా మాట్లాడకూడదని పోలీసులు జాగ్రత్తలు చెబుతున్న విషయం తెలిసిందే. ఓ జంట మాత్రం ఏకంగా శృంగారంలో పాల్గొని ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో పురాన్‌పూర్‌కు చెందిన 31ఏళ్ల యువకుడు ఫిలిబిత్‌లో పనిచేస్తున్న తన ప్రియురాలిని కారులో ఎక్కించుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. హైవేపై ప్రయాణిస్తుండగా మధ్యలో కోర్కెను ఆపుకోలేక ఆమెతో శృంగారంలో పాల్గొంటూ కారు నడుపుతున్నాడు.

ఈ క్రమంలో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో యువకుడు ప్రాణాలు కోల్పోగా.. 24 ఏళ్ల ఆ యువతి తలకు కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ట్రక్ డ్రైవర్ కూడా అతివేగంగా కారును ఢీకొట్టాడని, అతనిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుందని తెలిపారు.












Click it and Unblock the Notifications