రక్తం వచ్చేలా కొట్టినా..: పోలీస్‌స్టేషన్‌లోనే నిప్పంటించుకున్న దంపతులు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో భార్యభర్తలిద్దరూ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన ఆ దంపతులు ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఘటనపై సీరియస్‌గా స్పందించిన ఉన్నతాధికారులు.. సదరు పోలీస్ స్టేషన్ ఇంఛార్జీతోపాటు ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.

పోలీస్ స్టేషన్‌లోనే..
పీటీఐ కథనం ప్రకారం.. మథురలోని సురిర్ పోలీస్ స్టేషన్ చేరుకున్న 40ఏళ్ల జోగిందర్, ఆయన భార్య చంద్రావతి ఒక్కసారిగా కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నారు. ఆ తర్వాత బాధతో కేకలు వేశారు. వెంటనే వచ్చిన పోలీసులు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. బట్టలు తెచ్చి వారిపైనా వేశారు.

వేధింపులంటూ ఫిర్యాదు చేస్తే..
అప్పటికే 60శాతం శరీరం కాలిపోయింది. వెంటనే బాధితులను మొదట దగ్గర్లోని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. తమ గ్రామంలో కొందరు పెద్దలు తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆ జంట సజీవ దహనానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

రక్తం వచ్చేలా కొట్టినా..
ఆగస్టు 23న జరిగిన గొడవలో జోగిందర్‌పై ఆయన గ్రామంలో పెద్ద మనిషిలా చెలామణి అవుతున్న సత్‌పాల్, ఆయన అనుచరులు దాడి చేశారు. జోగిందర్ తలపై కొట్టడంతో తీవ్రగాయమై, రక్తస్రావమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

చర్యలు తీసుకుంటాం..
కాగా, ఆగస్టు 23న బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మథుర సీనియర్ ఎస్పీ శలభ్ మాథూర్ తెలిపారు. ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారని చెప్పారు. కేసు నమోదైనప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై దర్యాప్తు చేస్తున్నామని, నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ స్పష్టం చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications