ప్రేమికులపై చీటింగ్ కేసు, దాడి, రేప్ చేస్తానని ఎస్ఐ బెదిరింపులు, వివరాలు అడిగిన కోర్టు!

బెంగళూరు: బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారని అరెస్టు అయిన ప్రేమికుల మీద దాడి చేసి రేప్ చేస్తానని యువతిని బెదిరించారని ఆరోపణలు రావడంతో ఏం జరిగిందో పూర్తి సమాచారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల చేతిలో గాయాలైన యువతీ యువకుడికి ఆసుపత్రిలో చికిత్స చేయించాలని సంబంధిత అధికారులకు న్యాయస్థానం సూచించింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కారవారలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

లవర్స్ మీద ఆరోపణలు

లవర్స్ మీద ఆరోపణలు

కారవార తాలుకా శిరవాడకు చెందిన మార్విన్ డిసౌజా, యల్లాపుర తాలుకా మంచికేరి ప్రాంతానికి చెందిన అంకితా రాయ్కర్ ప్రేమికులు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మార్విన్ డిసౌజా, అంకితా పలువురిని నమ్మించి మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

చీటింగ్ కేసులో బెయిల్

చీటింగ్ కేసులో బెయిల్

మార్విన్ డిసౌజా, అంకితా ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి తమను మోసం చేశారని కొందరు ఫిర్యాదు చెయ్యడంతో సెప్టెంబర్ 14వ తేదీన కారవార పోలీస్ స్టేషన్ లో ఇద్దరి మీద చీటింగ్ కేసు నమోదైయ్యింది. కేసు నమోదు కావడంతో కోర్టును ఆశ్రయించిన మార్విన్ డిసౌజా, అంకితా ముందస్తు బెయిల్ నమోదు చేసుకున్నారు.

మరో కేసులో లవర్స్ అరెస్టు

మరో కేసులో లవర్స్ అరెస్టు

మార్విన్ డిసౌజా, అంకితాకు మందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు పోలీసుల విచారణకు కచ్చితంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు ఇద్దరూ నవంబర్ 8వ తేదీన పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైనారు. మరో కేసులో మార్విన్ డిసౌజా, అంకితాలను అరెస్టు చేసిన పోలీసులు ఇద్దరినీ జైలుకు పంపించారు.

యువకుడి మీద దాడి !

యువకుడి మీద దాడి !

విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు పిలిపించి మార్విన్ డిసౌజా మీద దాడి చేసి జైలుకు తరలించారని, చికిత్స చేయించడానికి బెయిల్ మంజూరు చెయ్యాలని అతని న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. మార్విన్ డిసౌజాకు చికిత్స చేయించాలని కోర్టు జైలర్ కు ఆదేశాలు జారీ చేసింది.

రేప్ చేస్తానని ఎస్ఐ బెదిరింపులు ?

రేప్ చేస్తానని ఎస్ఐ బెదిరింపులు ?

విచారణ సమయంలో తన సోదరితో అసభ్యంగా ప్రవర్తించారని, పోలీస్ స్టేషన్ లో ఆమెను ఒంటరిగా నిర్బంధించి మహిళా పోలీసులు లేకుండానే విచారణ చేశారని, ఆమెతో మేము మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని అంకితా సోదరుడు అక్షయ్ రాయ్కర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో అంకితాతో అసభ్యంగా ప్రవర్తించారని, నిన్ను రేప్ చేస్తే ఎవరు వస్తారో నేనూ చూస్తానని ఎస్ఐ తన సోదరిని బెదిరించాడని అంకితా సోదరుడు అక్షయ్ కోర్టులో వాపోయాడు. వివరాలు తెసుకున్న కోర్టు అసలు ఏం జరిగిందో తమకు పూర్తిగా సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+