అసహజ, అధిక సెక్స్ కోసం భార్య, కోర్టుకు భర్త, డైవోర్స్
ముంబై: భార్య అధిక సెక్స్ కోసం వేధిస్తుండటంతో ఓ భర్త కోర్టుకెక్కాడు. అతనికి కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. తన భార్య తనను అధిక సెక్స్ కోసం వేధిస్తోందని, తనకు విడాకులు ఇప్పించాలని భర్త కుటుంబ న్యాయస్థానానికి వెళ్లారు. అతని విజ్ఞప్తి మేరకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఆయన భార్య కోర్టుకు హాజరు కాలేదు. పిటిషనర్ (భర్త) వాదనలపై కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో భర్త పిటిషన్ మేరకు విడాకులు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం చెప్పింది.

సదరు భర్త కుటుంబ న్యాయస్థానాన్ని జనవరిలో ఆశ్రయించాడు. తన భార్య పైన ఫిర్యాదు చేశాడు. అధిక సెక్స్ కోసం ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ పెళ్లి 2012 ఏప్రిల్‌లో అయిందని, అప్పటి నుండి వేధిస్తోందని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. బలవంతంగా మద్యం తాగిస్తోందని పేర్కొన్నాడు. తనను అసహజ సెక్స్ కోసం కూడా బలవంతం చేసేదని, తాను నిరాకరిస్తే అవమానించేదని చెప్పాడు.












Click it and Unblock the Notifications