తప్పుడు రేప్ కేసు: మోడల్‌పై కోర్టు ప్రాసిక్యూషన్

నిందితుడిని అదనపు సెషన్స్ జడ్జి వీరేందర్ భట్ అభియోగాల నుంచి విముక్తం చేస్తూ మహిళ ఇచ్చిన వాంగ్మూలాన్ని, సమర్పించిన సాక్ష్యాలను పరిశీలిస్తే నిందితుడిపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు తేలిందని చెప్పారు. ఆమె వాంగ్మూలంలో ఏ విధమైన విశ్వసనీయత కనిపించలేదని, ఆమె మాటల్లో నిజాయితీ గానీ నమ్మదగిన విషయాలు గానీ కనిపించలేదని అన్నారు.
గతంలో ఆ మహిళ అత్యాచారం చేశారంటూ పలు ఫిర్యాదులు చేసినట్లు, ఓ వయస్సు మళ్లిన ఎన్నారైపై కూడా ఫిర్యాదు చేసినట్లు విచారణ సందర్భంగా మోడల్ అంగీకరించినట్లు కోర్టు తెలిపింది. సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్న వ్యక్తులపై అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేయడం ఆమెకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది.
తనకు మత్తు ఇచ్చి తన బావ 2012 ఫిబ్రవరిలో ఓ హోటల్ గదిలో, మరో రెండు సార్లు ఇంట్లో తనపై అత్యాచారం చేశాడని ఆ మోడల్ 2013 ఫిబ్రవరిలో బిందాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాను నేరం చేయలేదని, మహిళ తనను కేసులో కావాలని ఇరికించిందని నిందితుడు కోర్టుకు చెప్పుకున్నాడు. డబ్బు కోసం తన సోదరుడిని వివాహం చేసుకుని అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని కూడా ఆరోపించాడు.
అత్యాచార సంఘటనల గురించి మహిళ తన తల్లిదండ్రులకు గానీ భర్తకు గానీ తెలియజేయకపోవడాన్ని కోర్టు ప్రస్తావించింది.












Click it and Unblock the Notifications