కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ ప్రయోగాల సత్ఫలితాలు: భారత్ బయోటెక్ వెల్లడి

హైదరాబాద్: నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ గురించిన సరికొత్త విషయాన్ని వెల్లడించింది. జంతువులపై కోవాగ్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపింది.

కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌తో ఎలాంటి ప్రతికూల కలగలేదని పేర్కొంది. ఈ మేరకు భారత్ బయోటెక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

COVAXIN demonstrates protective efficacy in live viral challenge model: Bharat Biotech

రెండో డోస్ ఇచ్చిన 14 రోజుల తర్వాత పరిశీలించామని, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్ వృద్ధిని నియంత్రించినట్లు గుర్తించామని తెలిపింది. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో వ్యాధి నియంత్రణ అద్భుతంగా ఉందని తెలిపింది.

మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భారత్ బయోటెక్ సంస్థ.. ఇటీవలే నిమ్స్‌లో రెండో దశ రెండో దశ ట్రయల్స్ ప్రారంభించింది. కాగా, భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది.

కాగా, దేశంలో ఇప్పటి వరకు 46,46,069 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9,55,029 యాక్టివ్ కేసులున్నాయి. 36,13,040 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 77,356 మంది కరోనా బారినపడి మరణించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతుండటంతో దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+