హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబ్జెక్ట్ నిపుణుల కమిటీకి కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్ డేటా : కీలక భేటీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ తాను అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ డేటా వివరాలను డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సమర్పించింది. దేశంలో అత్యవసర వినియోగానికి అధికారికంగా ఆమోదం లభించిన దాదాపు 5 నెలలకు కోవాగ్జిన్ పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందింది.

ఈ క్రమంలో డీసీజీఐ ఆధ్వర్యంలోని సబ్జెక్ట్ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) మంగళవారం సమావేశం కానుంది. ఈరోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో కోవాగ్జిన్ పూర్తి సమర్థతపై విశ్లేషించనున్నారు. కాగా, కోవాగ్జిన్.. కరోనాను అడ్డుకోవడంలో 81 శాతం ప్రభావవంతంగా ఉందని ఇప్పటికే భారత్ బయోటెక్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూడో దశ డేటా లేనప్పటికీ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోద ముద్రవేసింది.

 Covaxin Phase 3 Trial Data Shared With Expert Panel, Meets Today

జూన్ నెల ప్రారంభంలో టీకా అంతర్జాతీయ అత్యవసర వినియోగా జాబితా(ఈయూఎల్) కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థతో బుధవారం ప్రీ-సబ్మిషన్ సమావేశం జరుగనుంది. అత్యవసర వినియోగ జాబితా కోసం ట్రయల్ డేటాలో భద్రత, సమర్థత, నాణ్యత, రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్ అంశాల పరిశీలన జరుగుతుంది. కాగా, కోవాగ్జిన్ తీసుకున్న భారత పౌరులను తమ దేశంలోకి అనుమతించేందుకు ఇటీవల అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం కూడా లభిస్తే భారత్ బయోటెక్ టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతోపాటు ఈ టీకా తీసుకున్న భారతీయ పౌరులు అంతర్జాతీయ ప్రయాణాలు చేయడం కూడా సులభతరమవుతుంది. మార్చి నెలలో భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్ తొలి మధ్యంతర ఫలితాలను ప్రకటించింది.
టీకా 81 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.

మనదేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తోపాటు కోవాగ్జిన్ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ తయారు చేసింది. కాగా, గత కొద్ది రోజుల నుంచి రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీని కూడా వినియోగిస్తున్నారు.

English summary
Covaxin Phase 3 Trial Data Shared With Expert Panel, Meets Today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X