Coronavirus: వార్డ్ బాయ్ దెబ్బకు 15 మంది కరోనా, క్యూలో 75 మంది, ఏం చంపేస్తారా ?, గేమ్స్ వద్దు !

బెంగళూరు/ శివాజీనగర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ఎప్పుడు ఎవరికి ఆ వ్యాధి వస్తుందో చెప్పడం ఎవ్వరి తరం కాదని తెలిపోయింది. ఎవరి వలన ఏ రూపంలో మనకు కరోనా వైరస్ వస్తుందో చెప్పడం సాధ్యం కాదు అంటున్నారు సామాన్య ప్రజలు. ఇక ఒక్క ఏరియాలో వార్డు బాయ్ దెబ్బకు ఇప్పటి వరకు 15 మంది కరోనా వైరస్ సోకిందని వైద్యపరీక్షల్లో వెలుగు చూసింది. వార్డు బాయ్ ఉంటున్న ఫస్ట్ ఫ్లోర్ లో 75 మంది ఉండటం, వారికి వైద్య పరీక్షలు చెయ్యడం, వారిలో 15 మందికి కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన వారు ఏం మమ్మల్ని చంపేస్తారా ? అంటూ హడలిపోతున్నారు.

ఐటీ దేశ రాజధాని

ఐటీ దేశ రాజధాని

ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరులో కరోనా వైరస్ అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. కర్ణాటక ప్రభుత్వంతో పాటు బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) అధికారులు బెంగళూరులో కరోనా వైరస్ కట్టడికి శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు.

బెంగళూరులో బరి తెగించిన ప్రాంతాలు ?

బెంగళూరులో బరి తెగించిన ప్రాంతాలు ?

బెంగళూరు నగరంలో కొందరు బరి తెగించడంతో కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాపిస్తోంది. బెంగళూరు నగరంలోని పాదరాయనపుర, బాపూజీనగర, శివాజీనగర తదితర ప్రాంతాల్లో కొందరు బరితెగించి నిర్లక్షంగా సంచరించడంతో కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి చైన్ లింక్ లా వ్యాపించిందని ఇప్పటికే వెలుగు చూసింది.

శివాజీనగర్ హడల్

శివాజీనగర్ హడల్

బెంగళూరు నగరంలోని శివాజీనగర్ లో ఇప్పుడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే శివాజీనగర్ సీల్ డౌన్ కావడంతో అక్కడి ప్రజలు హడలిపోతున్నారు. ప్రతినిత్యం కొన్నివేల మంది సంచరించిన శివాజీనగర్ ప్రాంతంలో ఇప్పుడు చూద్దాం అంటే పట్టున పది మంది కూడా కనపడటం లేదు.

వార్డ్ బాయ్ నెంబర్ 653

వార్డ్ బాయ్ నెంబర్ 653

శివాజీనగర్ లోని వార్డు బాయ్ కరోనా కేసు నెంబర్ 653 వ్యక్తి వలన ఇప్పుడు అందరూ హడలిపోతున్నారు. వార్డు బాయ్ కరోనా కేసు నెంబర్ 653 సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నాడు. ఆ ఫ్లోర్ లో మొత్తం 75 మంది ఉంటున్నారు. వారిలో ఇప్పటి వరకు 20 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఒక్క దెబ్బకు 15 మందికి కరోనా

ఒక్క దెబ్బకు 15 మందికి కరోనా

వార్డు బాయ్ కరోనా కేసు నెంబర్ 653 కారణంగా 20 మందికి కరోనా వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆ 20 మందిలో 11 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. ఇదే వార్డు బాయ్ కారణంగా ఇంతకు ముందు ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. వార్డు బాయ్ దెబ్బకు మొత్తం 15 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. వార్డు బాయ్ ఉంటున్న ఫ్లోర్ లో ఉంటున్న మిగిలిన వారు ఎక్కడ మాకు కరోనా వైరస్ సోకుతుందో ? అనే భయంతో ఇప్పుడు హడలిపోతున్నారు. వార్డు బాయ్ నుంచి మరికొంత మందికి ఎక్కడ కరోనా వైరస్ వ్యాపిస్తుందో అనే భయంతో ఇప్పుడు అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+