అందరికీ కరోనా టీకా బూస్టర్ డోస్ - ఈ నెల10 నుంచి మొదలు : ప్రికాషన్ డోసులు సైతం..!!
కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్ లో తొలి - రెండో డోసు రికార్డు స్థాయిలో అందించిన కేంద్రం..ఇప్పుడు బూస్టర్ డోసుల పైన ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా.. 18 ఏళ్లు నిండిన వారికి అందరికీ బూస్టర్ డోస్ అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ డోసు అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసారు. కొత్త వేరియంట్ల పైన చర్చ..వెలుగు లోకి వస్తున్న సమయంలో కేంద్రం అప్రమత్తమైంది. అందులో భాగంగానే బూస్టర్ డోస్ లు అందించేందుకు ముందుకు వచ్చింది.
Recommended Video

ప్రయివేటు ఆస్పత్రుల ద్వారా వీటిని అందించనుంది. ఇదే సమయంలో తొలి - రెండో విడతల వ్యాక్సినేషన్ తో పాటుగా వయోజనులకు ప్రికాషన్ డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్రం ప్రకటించింది. 18 ఏళ్ల వయసు నిండిన వారు..అదే విధంగా రెండో డోసు తీసుకొని తొమ్మది నెలలు పూర్తయిన వారు బూస్టరు డోస్ కు అర్హులుగా పేర్కొంది.

దేశ వ్యాప్తంగా 15 ఏళ్లకు పైడిన వారిలో దాదాపుగా 96 శాతం మంది తొలి విడత వ్యాక్సినేషన్ తీసుకున్నట్లుగా కేంద్రం వెల్లడించింది. అదే విధంగా 15 ఏళ్లు పైబడిన వారిలో రెండో డోసు సైతం పూర్తి చేసిన వారి సంఖ్య 83 శాతంగా నిర్ధారించింది. ఇక, ఇప్పుడు బూస్టర్ డోసు సైతం ఇవ్వటం ద్వారా నిపుణుల సూచనల మేరకు పూర్తిగా కరోనా వేరియంట్ల నుంచి రక్షణ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కొద్ది రోజులుగా చైనా నగరాలతో పాటుగా యూకేలోనూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. భారత్ లో పూర్తిగా నియంత్రణలోకి వచ్చినా .. ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక, నాలుగో వేవ్ గురించి పలు అధ్యయన సంస్థలు నివేదికలు ఇచ్చినా..వ్యాక్సినేష్ మాత్రం ఆయుధంగా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కరోనా పూర్తిగా తగ్గినా..కొంత కాలం మాస్కు..సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పూర్తి కరోనా నిబంధనలను సడలించారు. ఇప్పుడు, బూస్టర్ డోసు అందుబాటులోకి రావటంతో 18 ఏళ్లు దాటిన వారు..ఈ డోసు తీసుకొనేందుకు అర్హులుగా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications