సంక్షోభంవేళ కేంద్రం కీలక నిర్ణయం: ఆక్సిజన్, కరోనా వ్యాక్సిన్ దిగుమతులపై కస్టమ్ డ్యూటీ మాఫీ

న్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత కూడా వేధిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కాస్త ఉపశమనం కలుగనుంది. ఆక్సిజన్, కరోనా వ్యాక్సిన్, ఇతర కరోనా సంబంధిత వైద్య పరికరాలు, ఔషధాలపై దిగుమతి సుంకాన్ని మూడు నెలలపాటు మాఫీ చేసింది.

Recommended Video

    Oxygen Crisis : Centre Exempts Customs Duty on Vaccines, Oxygen For 3 Months || Oneindia Telugu
    విశాఖ నుంచి ఆక్సిజన్..

    విశాఖ నుంచి ఆక్సిజన్..

    ప్రాణవాయువు అందకపోవడం వల్ల రోజూ పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లు మృత్యువాత పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దేశ రాజధానిలోని గంగారామ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల 25 మంది పేషెంట్లు చనిపోయారంటే- దాని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఆక్సిజన్ ఉత్పత్తిని రెట్టింపు చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు 600 టన్నులకు పైగా ఆక్సిజన్ విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి సరఫరా అవుతోంది.

    కేంద్రం కీలక నిర్ణయం..

    కేంద్రం కీలక నిర్ణయం..

    మహారాష్ట్ర నుంచి బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్.. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రాణవాయువును నింపుకొని ఈ ఉదయమే మహారాష్ట్రకు చేరుకుంది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నత స్థాయి సమావేశం సందర్భంగా ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. ఆక్సిజన్‌తో పాటు వ్యాక్సిన్ కొరతను కూడా అధిగమించేలా కేంద్రం తక్షణ చర్యలను చేపట్టింది.

    దిగుమతి చేసుకునే వ్యాక్సిన్లు.. ఆక్సిజన్‌పై

    విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కరోనా వ్యాక్సిన్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఎత్తి వేసింది కేంద్ర ప్రభుత్వం. కస్టమ్స్ డ్యూటీని మూడు నెలల పాటు మాఫీ చేసింది. అలాగే- దిగుమతి అయ్యే ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత ఉపకరణాలు, ఇతర పరికరాలపైనా ఇప్పుడు వసూలు చేస్తోన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్‌ను మాఫీ చేసింది. వచ్చే మూడునెలల పాటు ఈ మాఫీ వర్తిస్తుంది. జూలై చివరి వారం వరకూ కోవిడ్ వ్యాక్సిన్లు, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్‌లను వసూలు చేయబోమని మోడీ సర్కార్ ప్రకటించింది.

    ఆ వస్తువులివే..

    ఆ వస్తువులివే..

    ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కస్టమ్స్ డ్యూటీ, హెల్త్‌ సెస్‌ను మాఫీ చేసిన వస్తువుల జాబితాను ఈ ప్రకటనలో పొందుపరిచింది. మొత్తం 16 రకాల వస్తువులు ఇందులో ఉన్నాయి. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేట్‌తో కూడిన ఫ్లో మీటర్, రెగ్యులేటర్, కనెక్టర్స్, ట్యూబింగ్, వాక్యుమ్ ప్రెజర్ స్వింగ్ అబ్జార్పన్, ప్రెషర్ స్వింగ్ అబ్జార్పన్, ఆక్సిజన్ ప్లాంట్స్, క్రయోజనిక్ ఆక్సిజన్ ఎయిర్ సపరేషన్ యూనిట్స్, ప్రొడ్యూసింగ్ లిక్విడ్ గ్యాసోస్ ఆక్సిజన్, ఆక్సిజన్ క్యానిస్టర్, ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్, ఆక్సిజన్ స్టోరేజీ ట్యాంకులు, సిలిండర్లు..ఈ జాబితాలో ఉన్నాయి.

    వెంటిలేటర్లపైనా..

    వెంటిలేటర్లపైనా..

    క్రయోజనిక్ సిలిండర్లు, ఆక్సిజన్ జనరేటర్లు, ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఐఎస్ఓ కంటైనర్లు, ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి ఉద్దేశించిన క్రయోజనిక్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ట్యాంకులు, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి, దానికి ఉద్దేశించిన ఎలాంటి రకాలకు చెందిన పరికరాల దిగుమతిపైనా మూడు నెలల పాటు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ ఉండబోదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వెంటిలేటర్లు, హై ఫ్లో నాసల్ క్యానులా డివైజెస్, నాన్-ఇన్‌వ్యాజివ్ వెంటిలేటర్లకు సంబంధించిన హెల్మెట్లు, ఐసీయూ వెంటిలేటర్ల దిగుమతికి కూడా కేంద్ర ప్రభుత్వం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ నుంచి మినహాయింపు ఇచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+