వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Good News:ఒమిక్రాన్, డెల్టా వేరియంట్‌పై ప్రభావం.. 100 శాతం ఫలితం: భారత్ బయోటెక్

|
Google Oneindia TeluguNews

కరోనా కొత్త వేరియంట్లు రూపాంతరం చెందుతున్నాయి. కొన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఒమిక్రాన్.. అంతకుముందు డెల్టా.. రకరకాల వేరియంట్లు భయాందోళన కలిగిస్తున్నాయి. అయితే వీటన్నింటికీ శ్రీరామరక్ష.. వ్యాక్సిన్ తీసుకోవడమే.. అవును నిపుణులు తెలియజేయడంతో అంతా టీకాలు తీసుకుంటున్నారు. అయితే భారత్ బయోటెక్ మరో కీలక విషయం వెల్లడించింది.

రెండు డోసులు పూర్తయిన తర్వాత బూస్టర్ డోసు కూడా తీసుకోవడం కంపల్సరీ. ఇప్పుడు హెల్త్ వర్కర్స్.. 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసు ఇస్తున్నారు. కోవాక్సిన్ బూస్టర్ తీసుకోవడం వల్ల మేలు అని. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కొంటుందని భారత్ బయోటెక్ తెలియజేసింది. బూస్టర్ డోస్ డెల్టా వేరియంట్‌పై 100 శాతం.. ఒమిక్రాన్‌పై 90 శాతం పనిచేసిందని తెలియజేశారు. రెండు డోసుల తీసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకుంటే మంచి ప్రయోజనం కలిగిస్తోందని తెలియజేశారు. ఇదీ సార్స్ కోవిడి ఒమిక్రాన్, డెల్టా వేరియంట్‌పై మంచి ఫలితం ఇస్తుందని తెలిపారు.

Covid-19: Covaxin booster working against Omicron and Delta:Bharat Biotech

అల్పా, బీటా, డెల్టా, జెటా, కప్పా వేరియంట్లపై మంచి ఫలితం ఉంటుందని వివరించారు. కోవాక్సిన్ బూస్టర్ తీసుకోవడం వల్ల గుడ్ రిజల్ట్ ుందని భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. దీంతో కోవాక్సిన్ తన లక్ష్యాలను చేరుకుందని ఆయన చెప్పారు. ఇదీ యుక్త వయస్సు వారికి, పిల్లలకు మంచి పనిచేస్తుందని వివరించారు.

కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.

English summary
Vaccine manufacturer Bharat Biotech said the booster dose of Covaxin has generated robust neutralising antibody responses against both Omicron and Delta using a live virus neutralisation assay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X