వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్లపై కేంద్రం సంచలన ప్రకటన -కొవిషీల్డ్ రెండో డోసు గ్యాప్ 8వారాలకు పెంపు -ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండగా, వైరస్ విరుగుడు కోసం తయారైన వ్యాక్సిన్ల వాడకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. కొవిషీల్డ్ టీకా తొలి డోసుకు, రెండో డోసుకు మధ్య గ్యాప్ ను ఆరు నుంచి ఎనిమిది వారాలకు పెంచాలంటూ కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇన్నాళ్లూ కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి, రెండో డోసుకు మధ్య కేవలం నాలుగు వారాల గ్యాప్ కొనసాగుతుండగా, ఇప్పుడా గడువును దాదాపు రెట్టింపు చేయాలని కేంద్రం పేర్కొంది.

Recommended Video

Covid-19 : #Covishield 2nd Dose Gap Should Be Increased To 6-8 Weeks - Central Govt| Oneindia Telugu

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూఏపీలో వాలంటీర్ వ్యవస్థ రద్దుకు వైసీపీ ఎంపీ రఘురామ పోరు -ప్రధాని మోదీకి ఫిర్యాదు -తిరుపతి నుంచే షురూ

రాష్ట్రాలకు లేఖలు..

రాష్ట్రాలకు లేఖలు..


మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్‌తో పాటుగా ఆస్ట్రాజెనెకా-సీరం రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సీన్లను ప్రభుత్వలే అందిస్తున్నాయి. ఈ రెండు టీకాలూ 'డబుల్ షాట్స్(రెండు డోసుల)' విధానంలో అభివృద్ధి చేసినవి కావడంతో.. తొలి డోసుకు, రెండో డోసుకు మధ్య నాలుగు వారాల గ్యాప్ ఇస్తూ టీకాలను అందజేస్తున్నారు. అయితే, కొవిషీల్డ్ టీకాలను మాత్రం ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ తో ఇవ్వాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం లేఖలు రాసింది.

భారత్-పాక్ రహస్య శాంతి ప్రణాళిక -యూఏఈ మధ్యవర్తిత్వం -ఇమ్రాన్‌కు మోదీ విషెస్ - త్వరలో సంచలనాలుభారత్-పాక్ రహస్య శాంతి ప్రణాళిక -యూఏఈ మధ్యవర్తిత్వం -ఇమ్రాన్‌కు మోదీ విషెస్ - త్వరలో సంచలనాలు

కొవిషీల్డ్‌కు మాత్రమే కొవాగ్జిన్‌కు కాదు..

కొవిషీల్డ్‌కు మాత్రమే కొవాగ్జిన్‌కు కాదు..


కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో తొలి, రెండో డోసు మధ్య గ్యాప్ ను నాలుగు వారాలు కాకుండా, ఆరు నెంచి ఎనిమిది వారాలకు పెంచాలని కేంద్రం తాజాగా ఉత్తర్వులిచ్చింది. డోసుల మధ్య గ్యాప్ ను పెంచడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయన్న టీకా నిపుణుల సలహాలు, సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. కాగా, ఈ సవరణ కేవలం కోవిషీల్డ్‌కు మాత్రమే వర్తిస్తుందని, కోవాక్సిన్‌ మాత్రం పాత విధానంలోనే(4వారాల గ్యాప్ తో) కొనసాగుతుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. నిజానికి

ఆస్ట్రాజెనెకాపై అనుమానాలు..

ఆస్ట్రాజెనెకాపై అనుమానాలు..


బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజమైన ఆస్ట్రాజెనెకా యూరప్ దేశాల్లో పంపిణీ చేసిన వ్యాక్సిన్లపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యాపించాయి. ఆస్ట్రియాలో ఓ నర్సు ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒంట్లో రక్తం గడ్డకట్టి చనిపోయిందని వార్తలు రావడంతో డజనుకుపైగా దేశాలు తాత్కాలికంగా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని నిలిపేశాయి. కానీ నర్సు మరణానికి కారణం వ్యాక్సిన్ కాదని తేలడంతో మళ్లీ టీకాల పంపిణీని పునరుద్దరించాయి. సదరు ఆస్ట్రాజెనెకా కంపెనీనే భారత్ లో సీరం సంస్థతో కలిసి 'కొవిషీల్డ్' పేరుతో వ్యాక్సిన్ విక్రయిస్తోన్న నేపథ్యంలో బీజేపీకే చెందిన సుబ్రహ్మణ్యస్వామి కేంద్రంపై వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రమాదకారి కాదని తేటతెల్లమైంది. ఇదిలా ఉంటే..

ఇప్పటికే 4.50కోట్ల మందికి..

ఇప్పటికే 4.50కోట్ల మందికి..

కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో కొత్తగా 46,951 పాజిటివ్ కేసులు, 212 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య1,16,46,081కు, మరణాల సంఖ్య 1,59,967కు పెరిగింది. అదేసమయంలో కరోనా కట్టడి కోసం ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతున్నది. ఆదివారం (మార్చి 21) ఒక్కరోజే 4,62,157 మంది టీకాలు వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 4,50,65,998కి చేరుకుంది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసును ఆరు నుంచి ఎనిమిది వారాల గ్యాప్ తో వేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలిచ్చింది.

English summary
the union govt has announced an important update regarding covid-19 vaccination in india. Centre on monday writes to states to increase gap between 2 doses of Covishield to 6-8 weeks based on experts' recommendation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X