Coronavirus: కరోనాను ఎగతాళి చేసిన టిక్ టాక్ స్టార్, అదే రోగంతో నేడు క్వారంటైన్, సారీ!

భోపాల్: కరోనా వైరస్ (COVID 19) ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచ దేశాల్లోని వైద్యులు పదేపదే చెబుతున్నారు. కరోనా వైరస్ కూ దూరంగా ఉండాలని, అనేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని లక్ష మంది ప్రజలు పిట్టల్లారాలిపోతున్నారు. ఇదే సమయంలో కరోనా వైరస్ గురించి ఎగతాళిగా మాట్లాడేవారు, గేలి చేసేవారు ఎక్కువ అయ్యారు.

Recommended Video

    COVID 19 : TikTok Star Samir Khan Tests Positive For Covid-19 After Mocking Face Mask In His Video

    కరోనా వైరస్ ను ఎగతాళి చేసి, మాస్క్ లు కట్టుకుంటున్న ప్రజలను చులకనగా మాట్లాడిన టిక్ స్టార్ కు అదే వ్యాధిసోకి నేడు విచారం వ్యక్తం చేస్తున్నాడు. కరోనా వైరస్ గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలను ఎగతాళి చేసిన నాకు ఈ రోజు అదేగతి పట్టిందని, అదే రోగంతో క్వారంటైన్ లో ఉన్నానని, మీరు నన్ను క్షమించాలని ఆ టిక్ టాక్ స్టార్ మరో వీడియో విడుదల చేశాడు.

    ఫేమస్ టిక్ టాక్ స్టార్

    ఫేమస్ టిక్ టాక్ స్టార్

    మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలోని ఓ పట్టణంలో టిక్ టాక్ స్టార్ సమీర్ ఖాన్ నివాసం ఉంటున్నాడు. అతి కొద్దికాలంలో సమీర్ ఖాన్ టిక్ టాక్ స్టార్ గా ఎదిగిపోయాడు. సమీర్ ఖాన్ వీడియోలను ప్రజలు తెగ ఎగబడి చూసేవారు. ఇదే సమయంలో త్వరగా టిక్ టాక్ స్టార్ గా ఎదిగిన సమీర్ ఖాన్ కు కొంచెం తల పొగరు ఎక్కువ అయ్యింది.

    గుడ్డ ముక్క కట్టుకుంటే కరోనా రాదా?

    గుడ్డ ముక్క కట్టుకుంటే కరోనా రాదా?

    ఇటీవల ప్రపంచ దేశాల ప్రజలకు కరోనా వైరస్ కంటిమీద కునుకుటేకుండా చేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు లక్ష మందికి పైగా ప్రాణాలు పోయాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి కొన్ని రోజుల క్రితం టిక్ టాక్ స్టార్ సమీర్ ఖాన్ చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు. ముఖానికి చిన్న గుడ్డ కట్టుకుంటే మీకు కరోనా రాదా ?, మీరు దేవుడి మీద భారం వెయ్యాలి, అప్పుడే కరోనా నుంచి తప్పించుకోవచ్చు, అంతే కాని ముఖానికి మాస్క్ లు వేసుకుని ఇంట్లో ఉంటే కరోనా రాకుండా ఉండదు అంటూ ప్రజలను కించపరుస్తూ ఓ టిక్ టాక్ వీడియో విడుదల చేశాడు. సమీర్ ఖాన్ కరోనా వైరస్ ను, ప్రజలను ఎగతాళి చేస్తూ విడుదల చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే సమయంలో చాలా మంది సమీర్ ఖాన్ మీద విరుచుకుపడ్డారు.

    అదే రోగంతో నేడు క్వారంటైన్

    అదే రోగంతో నేడు క్వారంటైన్

    కరోనా వైరస్ వ్యాధిని, ఆ వ్యాధి రాకుండా జాగ్రత్తలను తీసుకుంటున్న ప్రజలను కించపరుస్తూ కొన్ని రోజుల క్రితం టిక్ టాక్ వీడియో విడుదల చేసిన సమీర్ ఖాన్ కు చివరికి అదే కరోనా వ్యాధి సోకింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ టిక్ టాక్ స్టార్ సమీర్ ఖాన్ కరోనా క్వారంటైన్ లో ఉన్నాడు.

     టిక్ టాక్ స్టార్ కు కరోనా

    టిక్ టాక్ స్టార్ కు కరోనా

    కరోనా వైరస్, ఆ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజలను కించపరుస్తూ, ఎగతాళి చేస్తూ గతంలో టిక్ టాక్ వీడియో విడుదల చేసిన టిక్ టాక్ స్టార్ సమీర్ ఖాన్ ఇప్పుడు మరో వీడియో విడుదల చేశాడు. డాక్టర్లు నాకు కరోనా వైరస్ ఉందని నిర్దారించారని టిక్ టక్ స్టార్ సమీర్ ఖాన్ అన్నాడు.

    నన్ను క్షమించండి, జీవితంలో!

    నన్ను క్షమించండి, జీవితంలో!

    కరోనా వైరస్ గురించి, మీ గురించి (ప్రజలు) ఎగతాళి చేస్తూ హేళనగా మాట్లాడకూడదని ఇప్పుడు నాకు అర్థం అయ్యింది. నన్ను క్షమించండి, జీవితంలో ఇలాంటి వీడియోలు ఇంకో సారి పోస్టు చెయ్యనని సమీర్ ఖాన్ విచారం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం మీద కరోనా వైరస్ గురించి, ఆ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రజలను ఎగతాళి చేసిన టిక్ టాక్ స్టార్ నేడు కరోనా క్వారంటైన్ లో విచారం వ్యక్తం చేస్తూ కాలం గడుపుతున్నాడు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+