ఢిల్లీలో కరోనా కల్లోలం - ఒక్క రోజులోనే 1,313 కేసులు నమోదు : ఏడు నెలల తరువాత..!!

తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఒక్క సారిగా కరోనా కేసులు కలకలకం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని విధంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతోంది. ఒక వైపు ఒమిక్రాన్ కేసుల కారణంగా.. అనేక ఆంక్షలను దేశ రాజధానిలో అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో కరోనా తీవ్రత ఢిల్లీలో పెరుగుతోంది. తాజాగా గురువారం ఒక్క రోజే ఢిల్లీలో 1313 కోవిడ్ పాజిటివ్ కేసులను గుర్తించారు. బుధవారం కంటే ఈ రోజున 42శాతం అధికంగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 7 నెలల తర్వాత దేశ రాజధానిలో అధిక కేసులు నమోదు కావడం ఇదే.

ఏడు నెలల తరువాత అధికంగా

ఏడు నెలల తరువాత అధికంగా


మే 26న ఢిల్లీలో 1.93 శాతం పాజిటివ్‌ రేటుతో 1,491 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో బుధవారం 923 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క సారిగా ఇప్పుడు కేసులు పెరిగాయి. మే 30వ తేదీ తరువాత ఇదే అత్యధిక నమోదు. కాగా.. గడిచిన 24 గంటల్లో 1.73 శాతంగా కరోనా పాజిటివిటీ రేటు నమోదైంది. ఢిల్లీలో మొత్తంగా 14,46, 415 కరోనా కేసులు నమోదు కాగా.. 25,107 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 3081 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఢిల్లీ వ్యాప్తంగా 645 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

ఢిల్లీలో ఆంక్షల అమలు

ఢిల్లీలో ఆంక్షల అమలు

కరోనా కేసులు పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం విధించిన కొవిడ్ ఎల్లో అలర్ట్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాత్రివేళ్లల్లో నైట్ కర్ఫ్యూలు అమల్లో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై గరిష్టంగా కొవిడ్ కేసులు నమోదు కాగా.. ఇతర నగరాల్లో భారీగా కేసుల సంఖ్య పెరిగాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్‌లలో గత రెండు వారాలుగా కోవిడ్ కేసులు భారీగా నమోదయ్యాయి.ఇటీవలే ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం కఠినతరం చేసింది. కోవిడ్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అందులో భాగంగా సినిమా హాళ్లు, జిమ్స్, స్పాలు మూసివేశారు. స్కూల్స్, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, స్పాలు, జిమ్‌లు, ల్టీప్లెక్స్‌లు, బాంక్వెట్ హాల్స్, ఆడిటోరియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మూతపడ్డాయి.

ప్రయాణాలకు కొత్త నిబంధనలు

ప్రయాణాలకు కొత్త నిబంధనలు

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక పెళ్లిళ్లు, అంతిమ సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుమతించనున్నారు. ప్రార్ధనా మందిరాలోకి భక్తుల ప్రవేశంపై కూడా నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ మెట్రో, బస్సులు, రెస్టారెంట్లు, బార్‌లు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి పరిమితి విధించింది. ఆటో,క్యాబ్‌లో ఇద్దరు ప్రయాణించడానికి మాత్రమే అనుమతి ఉంది. దుకాణ సముదాయాలు, మాల్స్‌లో దుకాణాలను సరి, భేసి విధానంలో నిర్వహించుకునేలా అనుమతినిచ్చింది. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతినిచ్చింది. రెండు మూడు రోజులుగా కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం కంటే ఎక్కువగా పెరిగిపోయింది. ఈ క్రమంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్-Iఅమలు చేస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+