స్పూత్నిక్-వి వ్యాక్సిన్: అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాలో భారత్ భాగస్వామ్యం..?
కరోనా వైరస్ కోసం తొలి వ్యాక్సిన్ రష్యా కనుగొన్న సంగతి తెలిసిందే. స్పూత్నిక్-వి వ్యాక్సిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూతురు సహా పలువురికి ఇచ్చారు. అయితే వ్యాక్సిన్ సరఫరా, అభివృద్ధిలో భాగస్వామ్యం, భారత్‌తో కలిసి ఉత్పత్తి చేయాలని రష్యా భావిస్తోంది. ఈ మేరకు రష్యా అంబాసిడర్ నికోలాయ్ కుడాషేవ్ తెలిపారు. స్పూత్నిక్-వి వ్యాక్సిన్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని లాన్సెట్ స్టడీ పేర్కొన్నది.
Recommended Video
స్పూత్నిక్-వి వ్యాక్సిన్‌కి సంబంధించి భారత్‌తో రష్యా సహకారానికి సంబంధించి చర్చలు జరిపిందని, దీనికి సంబంధించిన వివరాలను భారత ప్రభుత్వం వెల్లడించబోతుందని నికోలాయ్ తెలిపారు. సాంకేతిక దశల తర్వాత.. విదేశాల్లో కూడా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని నికోలాయ్ వెల్లడించారు. ఈ వారం విదేశాంగ మంత్రి జై శంకర్ మాస్కో పర్యటన సందర్భంగా ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది.

సరిహద్దులో చైనా దూసుకొస్తున్న క్రమంలో ఇండో పసిఫిక్ క్వాడ్ విధానాలపై రెండో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని ఇదివరకే ప్రకటించింది. అండమాన్ దీవుల్లో జపాన్‌తో భారత్ చర్చలు జరిపింది. అయితే మాస్కో మాత్రం ఇండో పసిఫిక్ విధానాలపై కాస్త అసంతృప్తిగానే ఉంది. కానీ డ్రాగన్ చర్యలపై మాత్రం రష్యా.. ఇతర దేశాలకు వివరించి మద్దతు కూడగట్టేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే రష్యా కూడా నిర్మాణాత్మక విధానంతో భారత్‌కు అండగా నిలుస్తోందని నికోలావ్ పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
-
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications