కోవిడ్: దిల్లీలో వారం రోజుల పాటు లాక్‌డౌన్

కరోనావైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించేందుకు నిర్ణయించింది.

ఈ రోజు(సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం(ఏప్రిల్ 26) ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ ఉంటుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

https://twitter.com/ANI/status/1384037278478045197

https://twitter.com/ANI/status/1384036778064027653

కాగా, ఇప్పటికే దిల్లీలో రెండు రోజుల వీకెండ్ లాక్‌డౌన్ విధించారు.

నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేశారు. అయినా, కేసుల తీవ్రత తగ్గకపోవడంతో వారం రోజుల పాటు కట్టుదిట్టమైన కర్ఫ్యూ అమలుకు నిర్ణయించారు.

లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయిన తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

దిల్లీలోని కన్నాట్ ప్లేస్

వేలల్లో కేసులు..

దిల్లీలో గత వారం రోజులుగా కేసుల తీవ్రంత విపరీతంగా పెరిగింది. ఆదివారం ఒక్క రోజే 25,462 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అంతకుముందు రోజు 24,375 కేసులు రికార్డయ్యాయి.

ఏప్రిల్ 11 నుంచి ప్రతి రోజూ 10 వేలకు మించి పాజిటివ్ కేసులు వస్తుండడం.. రోజువారీ కొత్త కేసులతో పోల్చితే కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంటుండడంతో ఆసుపత్రి వ్యవస్థపై ఒత్తిడి పడుతోంది.

ఆక్సిజన్, ఆసుపత్రి పడకల కొరత తీవ్రంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+