Tamil Nadu: 21వరకు , భారీగా సడలింపులు -కొత్తగా 15,759 కొవిడ్ కేసులు, 378 మరణాలు
దేశంలో కరోనా ప్రభావిత టాప్-5 రాష్ట్రాల్లో నాలుగు దక్షిణాదివే కావడం, అత్యధిక కేసుల జాబితాలో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. తొలి నుంచీ కేసులు, మరణాలు భారీగా ఉన్న తమిళనాడులో ప్రస్తుతం కొనసాగుతోన్న లాక్ డౌన్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజులు పొడిగించింది.
Recommended Video
తమిళనాడులో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈనెల 21 వరకూ పొడిగిస్తున్నట్లు స్టాలిన్ సర్కారు శుక్రవారం ప్రకటించింది. అయితే లాక్‌డౌన్ ఆంక్షలను భారీగా సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపులకు అనుమతిస్తారు. చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలను ఎయిర్ కండిషన్లు లేకుండా 50 శాతం కస్టమర్లతో సాయంత్రం 5 గంటలకు వరకూ అనుతిస్తామని ప్రభుత్వం పేర్కొంది. టాక్సీలు, ఆటోలు నడుస్తాయని వెల్లడించింది. అలాగే ప్రభుత్వ పార్కులు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ తెరుస్తారు.

మరోవైపు తమిళనాడులోని కోయంబత్తూరు, నీలగిరితో సహా 11 జిల్లాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రొవిజన్ స్టోర్లు, కూరగాయల దుకాణాలు, మాంసం, చేపల దుకాణాలు, పూలమ్ముకునే వారిని అనుమతిస్తామని తాజా ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇకపోతే,
తమిళనాడులో కరోనా తీవ్రత కొనసాగుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 15,759 వైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరో 378 మంది కరోనాతో మరణించారు. దీంతో ఆ తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,24,597కు, మొత్తం మరణాల సంఖ్య 28,906కు చేరింది. ప్రస్తుతం 1,74,802 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications