Covid: భారత్‌కు మరో దెబ్బ -విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం -భారతీయు ప్రయాణికులపైనా ఆంక్షలు
కరోనా మహమ్మారికి సంబంధించి రోజువారీ కేసుల్లో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టిన ఇండియాకు మరో బ్యాడ్ న్యూస్. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో భారత్ నుంచి అన్ని విమానాలపై యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిషేధం ప్రకటించింది. మన దేశం నుంచి వెళ్లే అంతర్జాతీయ సర్వీసుల్లో మెజార్టీ విమానాలు యూఏఈలోని దుబాయ్, షార్జా మీదుగా వెళ్లేవే కావడంతో తాజా నిషేధ నిర్ణయం మొత్తం విమానయాన రంగంపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు, అంటే, మే 5 వరకు నిషేధం విధిస్తున్నట్లు యూఏఈ విమానయాన శాఖ గురువారం ప్రకటించింది. ఒక్కవిమానాలపైనే కాదు, భారతీయ ప్రయాణికులపైనా యూఏఈ కఠిన ఆంక్షలు విధించింది. ఇతర దేశాల్లో 14 రోజులపాటు ఉండని భారతీయ ప్రయాణికులను కూడా (యూఏఈలోకి) అనుమతించబోమని తెలిపింది. అయితే,

యూఏఈ నుంచి భారత్ కు వచ్చే సర్వీసులు, కార్గో రాకపోకలు కొనసాగుతాయని, యూఏఈ పౌరులు, దౌత్య అధికారులు, సిబ్బంది, వ్యాపార వేత్తల విమానాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు యూఏఈ వెల్లడించింది. అయితే వీరంతా పది రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని, వచ్చిన రోజుతోపాటు, తర్వాత 4, 8 రోజుల్లో పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంది. ఈ కేటగిరి వ్యక్తుల ప్రయాణాలకు ముందుగా చేయించుకున్న కరోనా పరీక్ష గడువును 72 గంటల నుంచి 48 గంటలకు కుదించింది. కేవలం అనుమతించిన ల్యాబ్ రిపోర్టులను మాత్రమే అంగీకరిస్తామని ప్రకటించింది. మరోవైపు..
భారత్ నుంచి అదనపు విమానాల రాకపోకలకు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నిరాకరించింది. గురువారం ఇండియా నుంచి వచ్చే 8 అదనపు ప్రత్యేక విమానాల ల్యాండింగ్‌కు అనుమతించాల్సిందిగా నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి వచ్చిన అభ్యర్థనను తిరస్కరించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్ రేపటి (శుక్రవారం) నుంచి 'రెడ్‌లిస్ట్' ట్రావెల్ బ్యాన్‌ను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత విమానాలకు అనుమతి నిరాకరించింది. ఒత్తిళ్లు తీవ్రతరం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అదనపు విమానాల కోసం వచ్చిన అభ్యర్థనను తిరస్కరించినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. కాగా,
ఇండియాలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,14,835 కొత్త కేసులు, 2,104 మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక దేశంలో నమోదైన రోజువారీ అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. భారత్ లో మే నెల మూడో వారం దాకా వైరస్ ఉధృతి కొనసాగొచ్చన్న అంచనాల నేపథ్యంలో తొలుత బ్రిటన్, తర్వాత హాంకాంగ్, ఇప్పుడు యూఏఈ విమానాల రాకపై నిషేధం విధించాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications