వ్యాక్సిన్ వేసుకోవాలంటే భయం: మన్ కీ బాత్‌లో మోడీకి షాక్: వారికి నా పేరు చెప్పండి

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని దులారియా, భీమ్‌పూర్ గ్రామాలకు చెందిన రాజేష్ హిరావే, కిశోర్ అనే ఇద్దరు గ్రామస్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకోని విధంగా షాకిచ్చారు. ప్రధాన మంత్రి రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన మన్ కీ బాత్ ప్రసంగం సందర్భంగా మోడీ రాజేష్, కిశోర్‌లతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకున్నారా? అంటూ మోడీ వారిని ప్రశ్నించగా.. లేదంటూ సమాధానం ఇచ్చారు. వ్యాక్సిన్ వేసుకుంటే తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రాణాలు సైతం పోతోన్నాయంటూ తోటి వారు చెబుతున్నారని పేర్కొన్నారు. అందుకే వ్యాక్సిన్ పట్ల ఆసక్తి లేదని తేల్చి చెప్పారు.

జ్వరం వస్తుందంతే..

జ్వరం వస్తుందంతే..

దీనిపై మోడీ బదులిస్తూ- తాను స్వయంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని గుర్తు చేశారు. ఇప్పటిదాకా 31 కోట్ల మందికి పైగా పౌరులు వ్యాక్సిన్ వేసుకున్నారని చెప్పారు. టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యం రాదని అన్నారు. కొద్దిగా జ్వరం మాత్రమే వస్తుందని మోడీ వారికి అర్థమయ్యేలా వివరించారు.

వ్యాక్సిన్ వేసుకుంటే అనారోగ్యానికి గురవుతారంటూ భ్రమలు కల్పించే వారికి తన పేరు చెప్పాలని అన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న అన్ని ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా వ్యాక్సిన్‌పై ప్రచారం చేస్తోన్నామని గుర్తు చేశారు. శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమించి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారని, దానిపై తాము నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోందని, వ్యాక్సిన్‌తో దాన్ని అడ్డుకోగలమని అన్నారు.

భయపెట్టే వాళ్లను పట్టించుకోవద్దు..

భయపెట్టే వాళ్లను పట్టించుకోవద్దు..

భయపెట్టే వాళ్లు.. భయపెడుతూనే ఉంటారని, వాటిని పట్టించుకోవద్దని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం ప్రమాదానికి దారి తీస్తుందని ప్రధాని హెచ్చరించారు. అది ఒక్కరికే కాకుండా అతని కుటుంబం మొత్తాన్నీ ఇబ్బందుల్లోకి నెడుతుందని అన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని మారుమూల గ్రామాల్లో సైతం వందశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయిందని ప్రధాని అన్నారు.

ఇదే పరిస్థితి దేశంలోని అనేక గ్రామాల్లో నెలకొని ఉందని చెప్పారు. వ్యాక్సిన్ పట్ల ఎలాంటి భయాందోళనలు ఉంచుకోవద్దని ప్రధాని ఆ గ్రామస్తులకు స్పష్టం చేశారు. రికార్డు స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

కరోనా ముప్పు తొలగిపోలేదు..

కరోనా ముప్పు తొలగిపోలేదు..

కొన్ని రాష్ట్రాలు ఒక్కరోజులో అత్యధిక వ్యాక్సిన్లను ఇచ్చాయని ప్రశంసించారు. కరోనా వైరస్ భయం ఇంకా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని అన్నారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని చెప్పారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి చర్యలను ఇంకొన్నిరోజుల పాటు కొనసాగించాలని కోరారు.

వ్యాక్సిన్ పట్ల ఎలాంటి భయాందోళనలు గానీ, భ్రమలు గానీ ఉంచుకోవద్దని, ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తితో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని, దీన్ని మరింత విస్తృతం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని మోడీ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+