Covishield: మా వ్యాక్సిన్లు సురక్షితం: సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
Covishield: కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఉపయోగించిన వ్యాక్సిన్లు సురక్షితమని, గుండె సంబంధిత మరణాలతో వాటికి ఎటువంటి సబంధం లేదని.. కొవిషీల్డ్ వ్యాక్సిన్లను తయారు చేసి పంపిణీ చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కొవిషీల్డ్ తయారీదారులు తమ వ్యాక్సిన్ సురక్షితమని పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్(ICMR), ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) తాజా పరిశోధనలను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బలపరిచింది. ఈ వ్యాక్సిన్లు సురక్షితమని, గుండె సంబంధిత మరణాలకు వాటికి ఎటువంటి సంబంధం లేదని ఈ పరిశోధనలు నిర్ధారించాయి.
సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఇలా రాసుకొచ్చింది. "వ్యాక్సిన్లు సురక్షితమైనవి, శాస్త్రీయంగా ధ్రువీకరించబడ్డాయి." అని పేర్కొంది. కొవిడ్ సంక్షోభం గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో కోట్లాది మందికి అందించబడిన వ్యాక్సిన్లపై విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది. ఐసీఎంఆర్, ఎయిమ్స్ నేతృత్వంలోని అధ్యయనాల నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఈ అధ్యయనాలు కొవిడ్-19 నుంచి కోలుకున్న పెద్దలలో ఆకస్మిక మరణాలు ముందే ఉన్న ఆరోగ్య పరిస్థితులు, జీవనశైలి కారకాలతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని కనుగొన్నాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ఒక ప్రకటనలో గుండెపోటుకు కరోనా వ్యాక్సిన్ కారణమని ప్రకటన చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆయన వాదనను తోసిపుచ్చింది. సిద్ధరామయ్య మంగళవారం మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్‌కు తొందరపాటుగా అనుమతి ఇచ్చారని, ఆపై వేగంగా వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని, కాబట్టి ఆకస్మిక మరణాలకు కరోనా వ్యాక్సిన్ కూడా కారణం కావచ్చని అన్నారు. ఆయన ప్రజలను ఉద్దేశించి, 'ఎవరికైనా ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, వెంటనే సమీప ఆసుపత్రిలో చెక్-అప్ చేయించుకోవాలని, లక్షణాలను అస్సలు విస్మరించవద్దని' విజ్ఞప్తి చేశారు.ఆకస్మిక మరణాలపై దేశంలోని వివిధ ఏజెన్సీలు దర్యాప్తు చేశాయని.. వాటికి కరోనా వ్యాక్సిన్‌తో ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదని దర్యాప్తులో తేలిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భారతదేశ టీకా కార్యక్రమం ప్రధానంగా రెండు ప్రధాన వ్యాక్సిన్‌లపై ఆధారపడింది. కొవిషీల్డ్, కొవాక్సిన్ వ్యాక్సిన్లు దేశవ్యాప్తంగా దాదాపు ఒక బిలియన్ మందికి అందించబడ్డాయి.
In light of recent concerns, we affirm:
— SerumInstituteIndia (@SerumInstIndia) July 3, 2025
Two large-scale studies by ICMR and AIIMS, as cited by the Ministry of Health (@MoHFW_INDIA) have found no link between COVID-19 vaccines and sudden deaths.
The vaccines are safe and scientifically validated.
Source: https://t.co/gWoXdrpj4U
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications