వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

90 శాతం ప్రొటెక్షన్.. కోవిషిల్డే భేష్.. స్టడీ

|
Google Oneindia TeluguNews

డెల్టా వేరియంట్ వల్ల జరిగే మరణాలను అడ్డుకోవడంలో కోవిషీల్డ్, ఫైజర్ వ్యాక్సిన్ 90 శాతం సమర్థంగా పనిచేస్తాయని తేలింది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో గురువారం ఓ అధ్యయనం పబ్లిష్ అయింది. స్కాట్ లాండ్ వైడ్ EAVE II కోవిడ్ -19 నిఘా ఫ్లాట్ ఫాం నుంచి సేకరించిన డేటాను ఉపయోగించి ఈ అధ్యయనాన్ని రూపొందించారు. పలు దేశాలను భయపెడుతున్న కోవిడ్ డెల్టా వేరియంట్ నుంచి సంభవించే మరణాలను అడ్డుకోవడంలో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లు ఎంతమేర ప్రభావంగా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ అధ్యయం నిర్వహించారు.

ఎడిన్ బర్గ్ యూనివర్శిటీ ,స్టాచ్ క్లైడ్ యూనివర్శిటీ మరియు పబ్లిక్ హెల్త్ స్కాట్లాండ్‌కు చెందిన రీసెర్చ్ బృందం..ఏప్రిల్-1,2021 నుంచి సెప్టెంబర్-27 మధ్యలో స్కాట్ లో ని 54లక్షల మందికి చెందిన డేటాను విశ్లేషించింది. ఏప్రిల్-1-సెప్టెంబర్ 27 మధ్యలో నేరుగా హాస్పిటల్ నుంచి కాకుండా సమాజంలో నిర్వహించిన పీసీఆర్ టెస్ట్ లో..లక్షా 15 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. 201 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి మృత్యు ముప్పుని అడ్డుకోవడంలో ఫైజర్-బయోఎన్ టెక్ వ్యాక్సిన్ 90 శాతం ప్రభావవంతంగా, ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ 91శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు అధ్యయనం విశ్లేషించింది.

covishield may offer over 90 percent protection

యూకేలో గతంలో వెలుగుచూసిన వేరియంట్ల కన్నా హాస్పిటల్ పాలయ్యే ప్రమాదాలను ఎక్కువగా కలిగిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న వెంటనే మరణ ముప్పు నుంచి అధిక రక్షణ కలుగుతుందని EAVE II స్టడీకి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఆజిజ్ షేక్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోనివాళ్లు ఉంటే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని..దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని అజిజ్ షేక్ తెలిపారు.

Recommended Video

Germany: Pilots Return To Work To Cover Tourism Demand

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

English summary
covishield may offer over 90 percent protection against death from delta variant study revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X