బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cow: గోమాతకు సీమంతం, అచ్చం ఆడబిడ్డకు ఎలా చేస్తారో అలాగే, ఊరంతం పండగే, గ్రేట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడబిడ్డ గర్భిణి అయితే ఆమెకు సీమంతం చేసి అందరిని పిలిచి భోజనాలు పెడుతారు. పుట్టింటి వాళ్లు మొదటి సారి బిడ్డకు జన్మనిస్తున్న సమయంలో సీమంతం చేసుకునే ఆడబిడ్డకు పసుపు, కుంకుమ, చీరా, జాకెట్, గాజులు, పూలు, పండ్లు, స్వీట్లతో పాటు బహుమతలు ఇచ్చి ఆశీర్వదిస్తారు. పుట్టింటి వారితో పాటు బందువులు అందరూ సీమంతం చేసుకుని మహిళను నిండునూరేళ్లు పిల్లాపాపలతో, పసుపుకుంకుమలతో జీవించాలని ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఆడబిడ్డను చూసుకుంటున్నట్లు సొంత బిడ్డలాగా చూసుకుంటున్న గోమాతకు సీమంతం చేసిన కుటుంబ సభ్యులు గోమాత కూడా తల్లితో సమానం అని నిరూపించారు.

గోమాత సొంత బిడ్డతో సమానం

గోమాత సొంత బిడ్డతో సమానం

కర్ణాటకలోని గదగ్ జిల్లా రోణా తాలుకాలోని మణసిగి గ్రామంలో శ్రీకాంత్, గౌరమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ ఆవులను పెంచుకుంటున్నారు. ఓ ఆవు దూడను తెచ్చుకున్న శ్రీకాంత్, గౌరమ్మ దంపతులు ఆ ఆవుకు గౌరి అని నామకరణం చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులను ఎలా పేరు పెట్టి పిలుస్తారో ఆ గోమాతను కూడా గౌరి అని పిలుస్తున్నారు.

 7 ఏళ్ల తరువాత గర్బిణి

7 ఏళ్ల తరువాత గర్బిణి

శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఆవును తెచ్చుకుని 7 సంవత్సరాలు అయిన తరువాత ఆ ఆవు గర్బవతి అయ్యింది. ప్రస్తుతం ఆ గోమాత గర్బవతి అయ్యి 8 నెలలు అయ్యింది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడబిడ్డ గర్భిణి అయితే ఆమెకు సీమంతం చేసి అందరిని పిలిచి భోజనాలు ఎలా పెడుతారు అలాగే గోమాత గౌరికి కూడా సీమంతం చెయ్యాలని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

గోమాతకు సీమంతం

గోమాతకు సీమంతం

పుట్టింటి వాళ్లు మొదటి సారి బిడ్డకు జన్మనిస్తున్న సమయంలో ఆడబిడ్డకు ఎలా సీమంతం చేస్తారో గోమాత గౌరికి కూడా అలాగే సీమంతం చేశారు. ఆవుకు శుభ్రంగా స్నానం చేయించి శరీరం అంతా పసుపు పూసి పూలతో అలంకరించారు. పట్టుచీర తీసుకు వచ్చి ఆవుకు కట్టారు. కాళ్లకు కొత్త గజ్జెలు తోడిగారు, అచ్చం ఆడబిడ్డకు ఎలా సీమంతం చేస్తారో అలాగే గోమాత గౌరికి కూడా సీమంతం చేశారు.

 ఊరంత పండగ చేశారు

ఊరంత పండగ చేశారు

బంధువులు, ఊర్లో వాళ్లు అందరిని ను పిలిచిన శ్రీమాంత్, గౌరమ్మ దంపతులు వారికి భోజనాలు వడ్డించారు. ఊరందరికి స్వీట్లు పంచిపెట్టారు. హిందువులు గోమాతను దేవతగా బావించడమే కాకుండా సీమంతం కూడా చేస్తారని శ్రీకాంత్, గౌరమ్మ దంపతులు నిరూపించారు. గోమాతకు సీమంతం చెయ్యడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Cow: Family performs baby shower ceremony for cow in Menasigi village in Rona taluk Of Gadag district in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X