ముఖ్య‌మంత్రి స‌రికొత్త డెఫినిష‌న్‌: ఆవు ఆక్సిజ‌న్‌ను పీల్చి, ఆక్సిజ‌న్‌ను వ‌దులుతుంద‌ట‌!

Recommended Video

    ఆవుపై ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి స‌రికొత్త డెఫినిష‌న్‌ | Cow Is The Only Animal That Exhales Oxygen

    డెహ్రాడూన్‌: ఈ భూగోళం మీద జీవించే ఏ ప్రాణి అయినా జీవించ‌డానికి ఆక్సిజ‌న్ కావాలి. ఆక్సిజ‌న్‌ను పీల్చి, కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను విడుద‌ల చేస్తాయి. ఇది సైన్స్ చెప్పే మాట‌. ఈ విష‌యాన్ని చిన్న‌ప్పుడే పాఠ్యాంశాల్లో చ‌దువుకున్నాం. ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి త్రివేంద్ర సింగ్ రావ‌త్ దీనికి ఓ స‌రికొత్త డెఫినిష‌న్ ఇచ్చారు. వింత వాద‌న‌ను లేవ‌నెత్తారు. ఈ ప్ర‌పంచంలో ఆవు ఒక్క‌టే- ఆక్సిజ‌న్‌ను పీల్చి, ఆక్సిజ‌న్‌నే విడుద‌ల చేస్తుంద‌ని అన్నారు.

    డెహ్రాడూన్‌లో ఓ స‌ద‌స్సుకు హాజ‌రైన ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. ఆవుకు మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల శ్వాస సంబంధ‌మైన వ్యాధులు కూడా న‌య‌మౌతాయ‌ని అన్నారు.ఆవు చావిడ్లో ఎక్కువ కాలం గ‌డ‌ప‌డం వ‌ల్ల టీబీ సైతం మాయ‌మౌతుంద‌ని త్రివేంద్ర‌సింగ్ తెలిపారు. గోవుల నుంచే త‌మ‌కు ఆక్సిజ‌న్ అందుతోంద‌నే విష‌యాన్ని త‌మ రాష్ట్రంలోని ప‌హాడీ ఇలాకా (ప‌ర్వ‌త ప్రాంతాలు)ల్లో నివ‌సించే ప్ర‌జ‌లు ఇప్పటికీ విశ్వ‌సిస్తున్నార‌ని అన్నారు.

    Cow is the only animal that exhales oxygen, says Uttarakhand CM

    ఆవులు విడుద‌ల చేసే ఆక్సిజ‌న్‌నే తాము పీల్చుతున్నామ‌ని వారు న‌మ్ముతున్నార‌ని త్రివేంద్ర‌సింగ్ చెప్పారు. గోవు మూత్రం, పాలు ఎంత శ్రేష్ఠ‌మైన‌వో అది విడుద‌ల చేసే వాయువు కూడా అంతే శ్రేష్ఠ‌మైన‌ద‌ని అన్నారు. రెండు రోజుల కింద‌టే ఉత్త‌రాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే అజ‌య్ భ‌ట్ ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను చేసిన విష‌యం తెలిసిందే. గ‌ర్భిణులు కాన్పు స‌మ‌యంలో గ‌రుడ్ గంగా జ‌లాన్ని తాగడం వ‌ల్ల సిజేరియ‌న్ల‌ను నివారించ‌వ‌చ్చ‌ని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+