గోరక్షా సేనను ఎందుకు నిషేధించవద్దో చెప్పండి: సుప్రీం ప్రశ్న
అల్వార్‌లో గోరక్షా సేన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందడంపై సుప్రీం కోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై మే 3వ తేదీలోపు సమాధానం చెప్పాలని రాజస్థాన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: అల్వార్‌లో గోరక్షా సేన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందడంపై సుప్రీం కోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై మే 3వ తేదీలోపు సమాధానం చెప్పాలని రాజస్థాన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
దానిపై నిషేధం ఎందుకు విధించకూడదో చెప్పాలని కేంద్రం, ఆరు రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

రాజస్థాన్‌తో పాటు గుజరాత్, కర్నాటక, ఉత్తర ప్రదేశ్, జార్కండ్ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లో కేంద్రంతో సహా ఈ రాష్ట్రాలు సమాధానం చెప్పాలని పేర్కొంది.
అల్వార్‌లో ఆవులను అక్రమంగా తరలిస్తుండటంతో గోరక్ష సేన దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు ముృతి చెందారు. దీనిపై కాంగ్రెస్ నేత షెహ్జాద్ పూనావాలా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించి, నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications