Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత

కమ్యూనిస్టు యోధుడు, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ (సీపీఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ సోకడంతో కొద్దిరోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారు. కాలమిస్టుగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన ఏచూరి 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా 1992 నుంచి కొనసాగుతున్నారు. తొలిసారిగా 1974లో ఎస్ఎఫ్ఐలో చేరి 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీకి ఎంపికయ్యారు.

ఆలిండియా ర్యాంకర్ గా
సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12వ తేదీన మద్రాసులో జన్మించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి, తల్లి కల్పకం ఏచూరి. తండ్రి ఏపీ స్టేట్ రోడ్ కార్పొరేషన్ లో చేయగా, తల్లి ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. ఆయన బాల్యం మొత్తం హైదరాబాద్ లోనే గడిచింది. ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తయిన తర్వాత ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్ లో చేరి సీబీఎస్ సీ సెకండరీ పరీక్షలో ఆలిండియా ర్యాంకర్ గా నిలిచారు. సెయింట్ స్టీఫెన్స్ లో ఆర్థిక శాస్త్రంలో బీఏ, జేఎన్ యూ నుంచి ఎంఏ పట్టా పొందారు.

CPM General secretary Sitaram yechury passes away at 72

అర్థాంతరంగా పీహెచ్ డీ నిలిపివేత
1975లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో అర్థాంతరంగా పీహెచ్ డీని నిలిపివేయాల్సి వచ్చింది. జర్నలిస్టు సీమా చిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయన మొదటి భార్య ఇంద్రాణి మజుందార్. ఏచూరికి మొత్తం ముగ్గురు సంతానం. 2021 ఏప్రిల్ 22న కొవిడ్ సోకడంతో సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ మృతిచెందారు. హిందూస్థాన్ పత్రికలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరుతో కాలమ్స్ రాసేవారు. పార్టీ పత్రిక పీపుల్స్ డెమెక్రసీ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కీలక పాత్ర పోషించారు. 1985లో జరిగిన పార్టీ రాజ్యాంగ సవరణలో ఏచూరి కీలక పాత్ర పోషించారు. 'కమ్యూనలిజం వర్సెస్‌ సెక్యులరిజం','మోదీ గవర్నమెంట్‌: న్యూ సర్జ్‌ ఆఫ్‌ కమ్యూనలిజం'వంటి పుస్తకాలు రాశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+