నువ్వు వ్యభిచారివే: పోలీసు అధికారి ఆవేశం
ముంబై: ముంబై నగరంలో నివాసం ఉంటున్న ఓ మహిళ తనను ఓ పోలీసు అధికారి నడి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి అవమానించారని పై అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు ఫిర్యాదు స్వీకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసు అధికారుల కథనం మేరకు 35 సంవత్సరాల మహిళ కారులో వెళుతున్నారు. ఆ సందర్బంలో ఓ పోలీసు అధికారి ఆమె కారును అడ్డగించారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించిన తరువాత మీరు ఇక్కడి నుంచి వెళ్లాలని ఆమెకు చెప్పారు.

ఆమె గుర్తింపు కార్డు చూపించిన తరువాత పోలీసు అధికారి తన అసలు స్వరూపం బయటపెట్టాడు. ఆమెకు ఈ మాటలు ఆ మాటలు చెప్పాడు. ఆమె పోలీసు అధికారి మాటలను అడ్డుకుంటూ అభ్యంతరం చెప్పడంతో ఆయనకు మండిపోయింది.
నువ్వు వ్యభిచారివే, ఎక్కడికి వెళ్లి వస్తున్నావు చెప్పూ అంటూ తనను దూషించాడని బాధితురాలు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదు చేసిన పోలీసు అధికారిని గుర్తించామని, ఆయన తప్పు చేసినట్లు రుజువు అయితే కఠినంగా శిక్షిస్తామని ముంబై పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications