ఆమెకు రవి గంటలో 44 సార్లు ఫోన్ చేయగలరా?: కుమారస్వామి

బెంగళూరు: రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతియ్యడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని, ప్రజలకు అన్ని నిజాలు తెలియాలనే ప్రతిపక్షంలో ఉన్న తాము పోరాటం చేస్తున్నామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి అన్నారు. సోమవారం మద్యాహ్నం ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

ఐఏఎస్ అధికారి రవి సాటి మహిళ ఐఏఎస్ అధికారికి ఒక గంటలో 44 సార్లు ఫోన్ చేశారని బహిరంగంగా మీడియాకు చెప్పిన సీఎం సిద్దరామయ్య ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. రవి సాటి మహిళ ఐఏఎస్ అధికారికి 44 సార్లు ఫోన్లు చేశారని సిద్దరామయ్య నిరూపిస్తే తాను రాజకీయ సన్యాయం చేస్తానని కుమారస్వామి సవాలు విసిరారు.

ఒక వేళ తప్పుడు సమాచారం ఇచ్చారని వెలుగు చూస్తే సిద్దరామయ్య రాజకీయ సన్యాసం చెయ్యడానికి సిద్దంగా ఉన్నారా అనే విషయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వలేదని, వారి డిమాండ్ లను చులకనగా చూశారని మండిపడ్డారు.

కేవలం కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాలు జారీ చెయ్యడం వలనే డి.కే. రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించారని, ఈ విషయం అందరికి తెలిసిందే కాబట్టి తాను ఇంకా ఎక్కువ మాట్లాడబోనని చెప్పారు. ప్రతిపక్షాలు రవి కుటుంబ సభ్యులను విధాన సౌధ దగ్గరకు పిలుచుకుని వచ్చి ధర్నా చేయించి చులకన రాజకీయాలు చేస్తున్నారని సీఎం సిద్దరామయ్య ఆరోపించారని గుర్తు చేశారు.

 D K Ravi

అయితే రవి మామ హనుమంతరాయప్ప కాంగ్రెస్ పార్టికి చెందిన నాయకుడు, ఆయనను ఎవరు విధాన సౌధ దగ్గరకు పిలుచుకుని వచ్చారని సమాదానం చెప్పాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రజల మనోభావాలు తెలుసుకుని వారికి న్యాయం జరిగే విధంగా పోరాటం చెయ్యడం ప్రతిపక్షాల హక్కు అని మాజీ ముఖ్య మంతి కుమారస్వామి అన్నారు. మొత్తం మీద రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిచండం స్వాగతిస్తున్నామని కుమారస్వామి చెప్పారు.

నేనెందుకు రాజీనామా చెయ్యాలి

ఐఏఎస్ రవి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినందుకు రాష్ట్ర హోంశాఖ మంత్రి కే. జే. జార్జ్ రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనకు చెందిన కంపెనీలు వాణిజ్య పన్ను చెల్లించలేదని, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. నోటీసులు జారీ చెయ్యడం వలనే ఐఏఎస్ అధికారి రవికి వేధింపులు ఎక్కువ అయ్యాయని అన్నారు. నైతిక భాద్యత వహిస్తు జార్జ్ రాజీనామ చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంపై సోమవారం సాయంత్రం కే.జే జార్జ్ విదాన సౌధలో స్పందించారు. తనకు చెందిన కంపెనీలకు ఎలాంటి నోటీసులు రాలేదని అన్నారు. తన కంపెనీలు వాణిజ్య పన్ను చెల్లించాయని స్పష్టం చేశారు. తమ కంపెనీలకు నోటీసులు వచ్చాయని, తానే వేధింపులకు పాల్పడ్డానని వారి దగ్గర సాక్షాలు ఉంటే వెంటనే బహిరంగ పరచాలని జార్జ్ సవాలు విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+