సెక్స్ కోసం: భార్యకు బొద్దింకలంటే భయమని భర్త ఏం చేశాడంటే.!

భార్య తను కోరుకున్నట్లు శృంగారం చేయట్లేదనే కోపంతో ఆమెపై బొద్దింకలు వదిలి పైశాచిక ఆనందానికి పాల్పడ్డాడు ఓ భర్త.

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్య తను కోరుకున్నట్లు శృంగారం చేయట్లేదనే కోపంతో ఆమెపై బొద్దింకలు వదిలి పైశాచిక ఆనందానికి పాల్పడ్డాడు ఓ నీచుడు. అతని వేధింపులు భరించలేక బాధితురాలు మహిళా హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. దీంతో నిందితుడిపై కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళితే.. బన్నేరుఘట్ట రోడ్డులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే అవినాశ్ శర్మ(40), సుజాతలు పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అవినాశ్‌కు ఇటీవల మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

Creepy Husband Harassed Wife With Cockroaches For Sex! Complaint Filed!

సదరు విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యకు బొద్దింకలంటే భయం అనే విషయం తెలుసుకున్న అవినాశ్ రోజూ బొద్దింకలను ఆమెపై వదిలి రాక్షసంగా ప్రవర్తిస్తుండేవాడు.

ఆమె రోదనలు పెట్టి భయపడుతుంటే అవినాశ్ ఆనందపడేవారు. ఎన్ని బాధలు పెట్టినా పిల్లల భవిష్యత్ కోసం ఆమె మిన్నకుండిపోయింది. చివరకు అతని పెట్టే బాధలు భరించలేని సుజాత.. మహిళా హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు అవినాశ్‌పై సౌత్ఈస్ట్ డివిజన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనితా సహాయవాణి వారు అవినాశ్‌కు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, వారి విచారణలో తాను తన భార్యను వేధించినట్లు అవినాశ్ అంగీకరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+