న్యూస్ యాప్" డైలీ హంట్"కు లైక్ కొట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్
Recommended Video
సచిన్ టెండూల్కర్.. ఈ పేరులో ఏదో వైబ్రేషన్స్ ఉంటాయి. గాడ్ ఆఫ్ క్రికెట్‌గా కీర్తి గడించిన ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్. బ్యాటింగ్‌కు దిగాడంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. క్రికెట్‌లో దాదాపు అన్ని రికార్డ్స్‌ను ఈ మాస్టర్ బ్లాస్టర్ తిరిగి రాశాడు. అలాంటి సచిన్ టెండూల్కర్ ఇష్ట ఇష్టాలు తెలుసుకోవడం అంటే ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. సచిన్ టెండూల్కర్ వార్తలను బాగా ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా తన స్మార్ట్ ఫోన్‌లో ఎప్పటికప్పుడు వార్తలను చదువుతూ ఉంటారని తన దగ్గరి సన్నిహితులు చెబుతుంటారు.
Congratulations to our Master Blaster @sachin_rt on being inducted in the #ICCHallOfFame pic.twitter.com/7FXC0PMuts
— Dailyhunt (@DailyhuntApp) July 19, 2019
ప్రముఖ న్యూస్ యాప్ డైలీ హంట్‌ను సచిన్ బాగా ఫాలో అవుతుంటారని సమాచారం. ఇందుకు నిదర్శనం డైలీ హంట్ యాప్‌కు ఒక లైక్ కొట్టడమే. తాజాగా ఐసీసీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో సచిన్ టెండూల్కర్ చోటు దక్కించుకున్నారు. సచిన్‌కు అభినందనలు తెలుపుతూ డైలీ హంట్ న్యూస్ యాప్ తన అధికారిక ట్విటర్ పేజ్‌పై పోస్టు చేసింది. ఈ పోస్టును చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఒక లైక్ వేసుకున్నాడు. ఇది డైలీ హంట్ సిబ్బందికి యాజమాన్యంకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. తమ వార్తలను పలువురు ప్రముఖలు వీక్షించడంపై ఆనందం వ్యక్తం చేసింది డైలీ హంట్ యాజమాన్యం. నిజాలతో కూడిన నిఖార్సయిన వార్తలు మున్ముందు ఇంకా అందజేస్తామని తమ వార్తల ద్వారా ప్రజల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంటామని యాజమాన్యం పేర్కొంది.

ఇక 2019 క్రికెట్ ప్రపంచకప్‌తో కామెంటేటర్ అవతారమెత్తిన సచిన్ టెండూల్కర్ తన కామెంటరీతో క్రీడాభిమానులను ఆకట్టుకున్నారు. అంతేకాదు తన క్రికెట్ అనుభవంను కూడా పంచుకోవడమే కాకుండా పిచ్ అనాలిసిస్ కూడా చేశాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడిన అనుభవం ఉన్న ఈ మాస్టర్ స్ట్రోక్ బ్యాట్స్‌మెన్ ఆట సాగేకొద్దీ పిచ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ముందుగానే అంచనావేసేవాడు. ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలామందిని ఆకట్టుకున్నాడు సచిన్ టెండూల్కర్. ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఐసీసీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించిన ఆరో భారతీయుడిగా గుర్తింపు పొందాడు సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్‌కు మరిన్ని సేవలు అందించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని డైలీ హంట్ యాజమాన్యం ఆకాంక్షించింది.












Click it and Unblock the Notifications