విద్యార్థినిపై రేప్ దుమారం: కాల్పుల్లో క్రికెటర్ మృతి

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ హంద్వారాలో జరిగిన కాల్పుల్లో ఆ రాష్ట్రానికి చెందిన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ నయీమ్ భట్ మరణించాడు. ఓ పాఠశాల విద్యార్ధినిపై ఓ సైనికుడు అత్యాచారం చేశాడనే పుకార్లు రావడంతో స్థానిక యువకులు ఆర్మీ పోస్ట్‌పైకి రాళ్లు రువ్వారు.

తనపై ఎవ్వరూ అత్యాచారం చేయలేదని చెప్పడానికి స్వయంగా ఆ బాలిక మీడియా ముందుకు వచ్చి పుకార్లకు అడ్డుకట్ట వేసేలోగానే ఆందోళనలు హింసాత్మకంగా మారిపోయాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు, సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ సమయంలో అటుగా వెళ్తోన్న నయీమ్ భట్ ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో బంధించేందుకు యత్నించాడు.

Cricketer Killed in Kashmir's Handwara Had Stopped To Take A Photo

కాల్పుల్లో పొరపాటున బుల్లెట్లు తగిలి ఇద్దరు చనిపోయారు. వీరిలో నయీమ్ భట్ కూడా ఉన్నాడు. నయీమ్ కాశ్మీర్ జింఖాన్ క్లబ్ తరపున టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. ఇప్పటికే పలు ట్రోఫీల్లో మ్యాన్ ఆఫ్ ద సీరీస్‌గా నిలిచాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కూడా ఇప్పటికే అందుకున్నాడు.

ఐదేళ్లుగా తమ క్లబ్ తరపున ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్న నయీమ్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నానని క్లబ్ కెప్టెన్ మన్సూర్ చెప్పారు. జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారా నుంచి జాతీయ స్థాయిలో అండర్ 19‌కు మూడేళ్ల క్రితమే ఎంపికయ్యాడు.

నయీమ్ సోదరుడు ఓ స్థానిక న్యూస్ ఏజెన్సీకి పనిచేస్తున్నాడు. కాల్పుల ఘటనపై అతను వార్తాసేకరణ జరుపుతున్న సమయంలోనే నయీమ్ భట్ మరణించినట్లు అతనికి కాల్ వచ్చింది. తోటి క్రికెటర్లు నయీమ్‌ను హంద్వారా సచిన్ టెండూల్కర్‌గా పిలుస్తుంటారు.

రెండు రోజుల క్రితం అతను తన రెండంతస్థుల భవనం నుంచి చివరిసారిగా బయటకు వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో అతన్ని మృత్యువు కాటేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+