ఓటు వేసే ముందు రాహుల్ ద్రవిడ్ , ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధా మూర్తి ఇలా, హాట్ టాపిక్ !
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఏప్రిల్ 26వ తేదీ ఉదయం బెంగళూరులోని డాలర్స్ కాలనీలో క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఓటు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఉదయం పోలింగ్ కేంద్రానికి వెళ్లి క్యూలో నిలబడి ఓటు వేసే రాహుల్ ద్రవిడ్ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేశారు.
ఇదే సమయంలో రాహుల్ ద్రవిడ్ బెంగళూరు ఓటర్లకు ఓ సందేశం ఇచ్చారు. బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఓటు వేసిన అనంతరం రాహుల్ ద్రవిడ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఓటు వెయ్యాలని ప్రజలకు మనవి చేశారు. ఓటింగ్ సజావుగా సాగడానికి అందరూ సహకరించాలని, ఓటింగ్ ప్రక్రియ చాలా సులువుగా జరుగుతోందని, ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత అని అన్నారు.

కాబట్టి ఓటర్లందరూ తమ హక్కును వినియోగించుకోవాలని రాహుల్ ద్రవిడ్ మనవి చేశారు. బెంగుళూరులో ఈసారి ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటును వేస్తారని నేను భావిస్తున్నానని రాహుల్ ద్రవిడ్ అన్నారు. ముఖ్యంగా యువతి యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేస్తే అది మరింత మెరుగ్గా ఉంటుందని రాహుల్ ద్రావిడ్ అన్నారు. మరోవైపు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆయన భార్య సుధా మూర్తితో కలిసి బెంగళూరులోని బీఈఎస్ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేశారు.
ఓటు వేసిన అనంతరం నారాయణ మూర్తి విలేకరులతో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఓటు వేసి బెంగళూరులో ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి సమాజంలో మార్పు తీసుకురావాలని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నానని నారాయణ మూర్తి అన్నారు. పోలింగ్ జరిగే రోజు మీరు ఇంట్లో కూర్చోవద్దు అని, మీరు బయటకు వచ్చి ఓటు వేసి మీ నాయకుడిని మీరే ఎన్నుకోవాలని నారాయణ మూర్తి పిలుపునిచ్చారు.
గ్రామీణ ప్రజలతో పోలిస్తే పట్టణ ప్రజలు తక్కువగా ఓటు వేస్తారని, ఇప్పుడు యువత బయటకు వచ్చి ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను అని సుధామూర్తి అన్నారు. బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. శుక్రవారం బెంగళూరులోని అన్ని లోక్ సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.












Click it and Unblock the Notifications