Crime: రసికుడితో భార్య రొమాన్స్, భార్య తల సైలెంట్ గా నరికేసిన సౌదీ మొగుడు, తల !
ముంబాయి/పాల్గార్: కర్ణాటకకు చెందిన యువతిని మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని కొంతకాలం భార్యతో కాపురం చేసిన భర్త తరువాత సౌదీకి వెళ్లిపోయాడు. మూడు సంవత్సరాల తరువాత సౌదీ నుంచి వచ్చిన భర్త అతని భార్యతో కలిసి కొత్త ఇంటిలోకి కాపురం వెళ్లాడు. తరువాత భార్య ఆచూకి గురించి ఆమె కుటుంబ సభ్యులకు తెలీలేదు. సంవత్సరం తరువాత మహిళ కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. కేసు విచారణ చేసిన పోలీసులకు కొన్ని నెలల తరువాత భర్త చిక్కిపోయాడు. ఏడాది క్రితం స్వాదీనం చేసుకున్న తల లేని మహిళ శవం మిస్సింగ్ కేసు నమోదు అయిన మహిళదే అని వెలుగు చూసింది. పోలీసులు విచారణలో భార్యను తల నరికి ఎందుకు చంపాను అని సౌదీ మొగుడు సైలెంట్ గా పిన్ టూ పిన్ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

బెళగావి యువతితో పెళ్లి
మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లాలో నివాసం ఉంటున్న ఆసీఫ్ హనీఫ్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కర్ణాటకలోని బెళగావి సిటీలో నివాసం ఉంటున్న సానియా షేక్ (24) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సానియాను వివాహం చేసుకుని కొంతకాలం ఆమెతో కాపురం చేసిన ఆసీఫ్ తరువాత ఉద్యోగం చెయ్యడానికి సౌదీకి వెళ్లిపోయాడు.

భార్యకు రసికుడు ఉన్నాడని భర్తకు తెలిసింది
భర్త ఆసీఫ్ సౌదీ వెళ్లిపోయిన తరువాత అతని భార్య సానియా బెళగావి చేరుకుని ఆమె అవ్వ ఇంటిలో నివాసం ఉండేది. తాను సౌదీలో ఉద్యోగం చేస్తూ డబ్బులు పంపిస్తుంటే తన భార్య సానియా బెళగావిలో ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చేస్తోందని ఆసీఫ్ కు అనుమానం పెరిగింది. బెళగావిలోని కొందరి సహాయంతో భార్య సానియా గురించి సౌదీలో ఉంటున్న ఆసీఫ్ తెలుసుకుంటున్నాడు.

భార్యను పిలుచుకుని వెళ్లి చితకబాదేశాడు
రెండు సంవత్సరాల తరువాత ఆసీఫ్ 2021 ఫిబ్రవరిలో సౌదీ నుంచి ముంబాయి చేరుకున్నాడు. తరువాత బెళగావిలో ఉంటున్న భార్య సానియాను పిలుచుకుని వెళ్లి పాల్గార్ జిల్లాలోని నల్లా సోపారా కొత్త ఇంటిలోకి కాపురం వెళ్లాడు. అక్రమ సంబందం విషయంలో ఆసీఫ్ అతని భార్యతో గొడవపడి ఆమెను చితకబాదడం మొదలుపెట్టాడు.

సైలెంట్ గా భార్య తల నరికి చంపేసిన సౌదీ మొగుడు
ఆసీఫ్ ఇంటికి వెళ్లిపోయిన తరువాత సానియా ఆచూకి గురించి ఆమె కుటుంబ సభ్యులకు తెలీలేదు. 2021 జులై 26వ తేదీన ఆసీఫ్ అతని భార్య సానియాతో గొడవపడి కొడవలితో ఆమె తల నరికి చంపేశాడు. సానియా మొండెం ట్రాలీ బ్యాగ్ లో తీసుకుని వెళ్లి క్రీక్ ప్రాంతంలో విసిరేశాడు. భార్య సానియా తల మాత్రం నదిలో విసిరేసిన ఆసీఫ్ తరువాత ఇళ్లు ఖాళీ చేసి ఎవ్వరికి అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు.

కేసు పెట్టిన సానియా అవ్వ
పోలీసులు సానియా తల లేని శవం స్వాధీనం చేసుకున్నారు. ముంబాయి, థానే, పాల్గార్ జిల్లాల్లో మహిళ మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదు అయ్యాయా అని ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో మొండంకు అంత్యక్రియులు చేశారు. సంవత్సరం తరువాత ఆగస్టు 29వ తేదీన సానియా ఆచూకి కనపడటం లేదని ఆమె అవ్వ మహారాష్ట్రలోని అచోల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.

థానేలో తలదాచుకున్న కిలాడీ మొగుడు
భార్య సానియాను చంపేసిన ఆసీఫ్ తరువాత నల్లా సోఫరా వదిలేసి థానే జిల్లాలోని ముంబ్రా ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని అక్కడ నివాసం ఉంటున్నాడు. సంవత్సరం తరువాత సానియా కనపడలేదని మిస్సింగ్ నమోదు కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు 20 రోజుల తరువాత ఆసీఫ్ ను అరెస్టు చేశారు. అయితే సానియా తల మాత్రం చిక్కడం లేదని పోలీసులు తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications