లవ్ మ్యారేజ్, అర్దరాత్రి కొడుకు, ఆంటీని నరికి చంపేసిన తండ్రి, కోడలు జస్ట్ మిస్, ఐసీయూ !

చెన్నై/క్రిష్ణగిరి: కాలేజ్ చదువు పూర్తి అయిన యువకుడు వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్న యువకుడు నెలకు రెండు సార్లు అతని సొంత ఊరికి వెళ్లి వస్తున్నాడు. ఇటీవల ఆ యుకుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న యువకుడిని అతని తండ్రి దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని ఉతంగరై సమీపంలోని కారుమడపాటి గ్రామంలో కోదండపాణి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కోదండపాణి కుమారుడు సుభాష్ (25) కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత తమిళనాడులోని తిరువూర్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తిరువూర్ లోనే ఉంటున్న సుభాష్ అప్పుడప్పుడు అతని ఊరికి వెళ్లి వస్తున్నాడు.

murder

పని చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్న అనూష (23) అనే యువతి, సుభాష్ ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడం, అనూష తక్కువ కులానికి చెందినది కావడంతో మొదట ప్రేమికులు మ్యాటర్ లీక్ కాకుండా జాగ్రత్తపడ్డాడు. చివరికి సుభాష్ తెగించి తన ప్రియురాలు అనూషను పెళ్లి చేసుకుంటానని అతని తండ్రి కోదండపాణికి చెప్పాడు.

తక్కువ కులం దానిని కోడలిగా తీసుకువస్తే నిన్ను, దానిని ఇద్దరిని చంపేస్తానని కోదండపాణి అతని కుమారుడు సుభాష్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే సుభాష్ అతని తండ్రి కోదండపాణిని ఎదిరించి ఇటీవల అతని ప్రియురాలు అనూషను పెళ్లి చేసుకున్నాడు. అనూష తల్లి కన్నమ్మ కూతురు, అల్లుడితో రాజీ అయిపోయింది.

 death

భార్య అనూష ఇంటిలోను సుభాష్ ఉండిపోయాడు. శుక్రవారం రాత్రి సుభాష్, అతని భార్య అనూష, అత్త కన్నమ్మ భోజనం చేసి నిద్రపోయారు. అర్దరాత్రి ఇంట్లోకి చొరబడిన కోదండపాణి అతని కుమారుడు సుభాష్, కోడలు అనూష, అనూష తల్లి కన్నమ్మను వేటకొడవలితో నరికేశాడు. తీవ్రగాయాలైన సుభాష్ అతని అత్త కన్నమ్మ స్పాట్ లో చనిపోయారు.

తీవ్రగాయాలైన అనూషాను ఆసుపత్రికి తరలించారు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్న కొడుకు సుభాష్ చివరికి అతని తండ్రి చేతిలోనే హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. జంట హత్యలు చేసిన కోదండపాణి తప్పించుకుని పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+