Twisst: జంట హత్యలు, చంపేస్తున్నాడని నిమిషం ముందు భర్తకు ఫోన్ చేసింది, చంపేసిన బాలరాజు !

చెన్నై/మదురై: పొలంలో పుట్టగొడుగులు కొయ్యడానికి ఇద్దరు మహిళలు వెళ్లారు. పొలం దగ్గర ఇద్దరు మహిళలు పుట్టగొడుగులు కోస్తున్న విషయం అటువైపు వెలుతున్న గ్రామస్తులు గమనించారు. రాత్రి అయినా ఇద్దరు మహిళలు ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామంలోని యువకులు మహిళల కోసం గాలించగా అటవి ప్రాంతంలో ఆ మహిళలు దారుణహత్యకు గురై శవమై కనిపించారు. ఇద్దరు మహిళల హత్య కేసులో పక్క గ్రామంలో నివాసం ఉంటున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. కుందేళ్లు పట్టుకోవడానికి వెళ్లిన వ్యక్తి చివరికి ఇద్దరు మహిళలను ఎలా హత్య చేశాడు ? అని తెలుసుకున్న గ్రామస్తులు హడలిపోయారు. ఒక మహిళను హత్య చేసిన తరువాత మరో మహిళ మమ్మల్ని చంపేస్తున్నాడని చెప్పడానికి ఆమె భర్తకు ఫోన్ చేసిందని, అయితే అతను ఫోన్ రిసీవ్ చెయ్యలేదని వెలుగు చూసింది.

పొలంలోకి వెళ్లిన మహిళలు

పొలంలోకి వెళ్లిన మహిళలు

తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని పెరియవలయంలో నివాసం ఉంటున్న కన్నగి, మలర్విజి ఇద్దరూ గ్రామం సమీపంలోని పొలాల్లో పుట్టగొడుగులు కొయ్యడానికి వెళ్లారు. అదే రోజు రాత్రి అయినా మలర్విజిలు ఇంటికి చేరుకోకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వాళ్ల కోసం గాలించారు.

ఇద్దరు మహిళల హత్య

ఇద్దరు మహిళల హత్య

కుటుంబ సభ్యులు, గ్రామంలోని యువకులు కనపడకుండా పోయిన కన్నగి, మలర్విజిల కోసం గాలించారు. అటవి ప్రాంతంలో కన్నగి, మలర్విజి దారుణహత్యకు గురై శవమై కనిపించడంతో వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హడలిపోయారు. మహిళల కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంత పోలీసులు వెళ్లి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు.

బాలరాజు అరెస్టు

బాలరాజు అరెస్టు

పుట్టగొడుగులు కోయ్యడానికి వెళ్లిన మలర్విజి, కన్నగి అనే మహిళల హత్య కేసు విచారణ చేసిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఇదే సమయంలో మహిళలు నివాసం ఉంటున్న గ్రామం పక్కనే ఉన్న అహ్వాలందొడి గ్రామంలో నివాసం ఉంటున్న బాలరాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

చంపేస్తున్నాడని భర్తకు ఫోన్ చేసింది

చంపేస్తున్నాడని భర్తకు ఫోన్ చేసింది

కుందేళ్ల వేట కోసం బాలరాజు అటవి ప్రాంతంలోకి వెళ్లాడు. ఆ సందర్బంలో మహిళలు దూరం దూరంగా పుట్టగొడుగులు కోస్తున్న విషయం గమనించాడు. మొదట మలర్విజిని బాలరాజు హత్య చేసి ఆమె శరీరం మీద నగలు లాక్కోవడానికి ప్రయత్నించాడు. అ ఆ సందర్బంలో విషయం గమనించిన కన్నగి ఆమె భర్త కోదండపాణికి ఫోన్ చేసింది.

పారిపోతున్న మహిళను వెంటాడి చంపేశాడు

పారిపోతున్న మహిళను వెంటాడి చంపేశాడు

కోదండపాణి ఫోన్ తియ్యకపోవడంతో కన్నగి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆ సందర్బంలో బాలరాజు కన్నగి విసయం బయటకు చెబుతుందని, తనను గుర్తు పడుతుందని భయంతో ఆమెను కూడా చంపేశాడని పోలీసు అధికారులు అంటున్నారు .బాలరాజు దగ్గర కంట్రీమేడ్ తుపాకి ఉందా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+